Mahaa Daily Exclusive

  భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఆపద సమయంలో డయల్ 100 కు ఫోన్ చేయండి మాట్వాడ ఇన్స్పెక్టర్ ఎన్ కరుణాకర్ రావు..!

Share

వరంగల్ మహా;

గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ఆపద సమయంలో
డయల్ 100 కు ఫోన్ చేసి పోలీస్ వారి సేవలు పొందవచ్చు మట్టేవాడ పోలీస్ ఇన్స్పెక్టర్ ఎన్ కరుణాకర్ రావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విస్తారంగా కురుస్తున్న వర్షాల వలన జిల్లాలోని నదులు,వాగులు,వంకలు, చెరువులు పొంగి ఉదృతంగా ప్రవహిస్తూ రోడ్లపైకి నీరు చేరే అవకాశం ఉన్నందున కాలి నడకన వాహనాలతో ప్రజలు రోడ్లు దాటేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సిఐ సూచించారు. సెల్ఫీల కోసం ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రదేశాలకు వెళ్లి ప్రమాదాలకు గురి కావద్దని నదులు, వాగులు, వంకల వద్దకు జాలర్లు, ప్రజలు చేపల వేటకు వెళ్ళకూడదని సూచించారు. పశువులను కాయడానికి నదులు,వాగులు, వంకల పరిసర ప్రాంతాల దగ్గరకు వెళ్లకూడదని సూచించారు. సాధ్యమైనంత వరకు అత్యవసర సమయాల్లో తప్ప మిగిలిన సమయాలలో బయటకు రాకుండా ఉండడానికి ప్రయత్నించ వలసిందిగా సూచించారు. మట్టేవాడ పోలీసు యంత్రాంగం ఇప్పటికే వర్షాల కారణంగా ప్రమాదకరంగా మారుతున్న రహదారులు, చెరువులు, వాగులు, వద్ద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లయితే వెంటనే డయల్ 100 కు ఫోన్ చేసి సమాచారం అందించి పోలీసుల సేవలను పొందాలని కోరారు. ఈ ఆపత్కాల సమయంలో ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని మట్వాడ ఇన్స్పెక్టర్ ఎన్ కరుణాకర్ రావు
విజ్ఞప్తి చేశారు.