Mahaa Daily Exclusive

  ఒక్క నిఘా నేత్రం 100 మందితో సమానం హనుమకొండ ఏసిపి నరసింహారావు ..!

Share

హన్మకొండ మహా;

హనుమకొండ నగరంలోని రెడ్డి కాలనీ సమ్మక్క సెంటర్లో కాలనీవాసులు ఏర్పాటుచేసిన నాలుగు సి సి కెమెరాలను హనుమకొండ ఏసిపి నరసింహారావు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఏసిపి మాట్లాడుతూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల నేరాలను అరికట్టవచ్చునని అదేవిధంగా నేరస్తులను గుర్తు పట్టడంలో కీలకపాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రతి కాలనీ వాసులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడంలో పోలీసులకు సహకరించాలని ఏసిపి కోరారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ మచ్చ శివకుమార్, ఇతర పోలీస్ సిబ్బంది, తోపాటు కాలనీవాసులు, పాల్గొన్నారు,