Mahaa Daily Exclusive

  ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి..!

Share

వరంగల్ మహా;

వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని బీరన్న కుంటకు చెందిన రాజు (35) అనే వ్యక్తి చెరువులో ఉండే ప్లాస్టిక్ చెత్త, బాటిళ్లు ను సేకరిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు అదుపు తప్పి చెరువులో పడిపోయి మృతి చెందాడు.
ప్రాంతవాసులు చూసి పోలీసులకు సమాచారం అందించగా, మిల్స్ కాలనీ పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికితీశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ సంఘటనతో రాజు కుటుంబం విషాదంలో మునిగిపోయింది. స్థానికులు అధికారుల సహాయం కోరుతున్నారు.