వరంగల్ మహా;
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు వరంగల్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ముందస్తు రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా స్కూల్ బస్సు డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ ట్రాఫిక్ సిఐ సుజాత మాట్లాడుతూ ప్రైవేటు స్కూల్ యాజమాన్యం తప్పనిసరిగా స్కూల్ బస్సు నడిపే డ్రైవర్లను వారు తాగి ఉన్నారా లేదా అని పరీక్షించాలని సూచించారు. ఇటీవల కాలంలో అధిక శాతం మద్యం సేవించి వాహనాలు నడపడం ద్వారా వాహనదారులు రోడ్డు ప్రమాదాలకు గురై మరణిస్తున్నారని, ఇలాంటి ప్రమాదాల నివారణ కై స్కూల్ బస్సు డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించడం జరిగిందని వరంగల్ ట్రాఫిక్ సిఐ సుజాత తెలిపారు.
Post Views: 45







