Mahaa Daily Exclusive

  రాష్ట్ర యువజన విభాగానికి అధ్యక్షుడిగా నీలం రాజ్ కిషోర్ నియామక పత్రాన్ని అందజేసిన పుట్ట పురుషోత్తం రావు..!

Share

వరంగల్ మహా;

మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర యువజన విభాగానికి అధ్యక్షునిగా నీలం రాజు కిషోర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇందుకు సహకారం అందించిన మున్నూరు కాపు సంఘం రాష్ట గౌరవ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర,
రాష్ట్ర అధ్యక్షుడు పుట్ట పురుషోత్తం రావు , ప్రధాన కార్యదర్శి పెద్ది పెంటయ్య, వరంగల్ తూర్పు మాజీ శాసనసభ్యులు నన్నపునేని నరేందర్, మున్నూరు కాపు సంఘం వరంగల్ తూర్పు నియోజకవర్గం కోఆర్డినేటర్లు పోతు కుమార్ స్వామి, పెంచల గోపికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం
నీలం రాజు కిషోర్ ఎంపీ రవిచంద్ర తో పాటు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ను వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు. ఈ సందర్భంగా వీరితో పాటు పలువురు ప్రముఖులు, మున్నూరు కాపు నాయకులు, నీలం రాజ్ కిషోర్ కు శుభాకాంక్షలు తెలిపారు.