Mahaa Daily Exclusive

  అధికారులు సమన్వయంతో పని చేయాలి. ఒక్క డెంగీ కేసు కూడ రాకుండా చూసుకోవాలి. ఖమ్మం డివిజనల్ పంచాయతీ అధికారి రాంబాబు…!

Share

నేలకొండపల్లి, జూలై 26 మహా:

పారిశుద్ధ్యం పట్ల నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని ఖమ్మం డివిజనల్ పంచాయతీ అధికారి రాంబాబు హెచ్చరించారు. మండలం లోని ‘ మంగాపురంతండా, నేలకొండపల్లి, సింగారెడ్డిపాలెం తదితర గ్రామాలలో శనివారం పర్యటించారు. పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ఏఎనీయం, ఆశా కార్యకర్తలకు, మండల పరిషత్ కార్యాలయం లో పంచాయతీ కార్యదర్శు లకు ప్రత్యేక సమావేశం ను నిర్వహించారు. వర్షాకాలం సీజన్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల ను వివరించారు. ప్రజలను చైతన్యం చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు… అన్ని శాఖల అధికారులు సమన్యయంతో పని చేసి.. ఒక్క డెంగీ కేసు కూడ నమోదు కాకుండా చూసుకోవాలని సూచించారు. సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తు గా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తాగునీరు కలుషితం కాకుండా నిత్యం పర్యవేక్షణ చేయాలని కార్యదర్శులకు సూచించారు. రహదారుల వెంట మురుగు నీరు లేకుండా ఎప్పటికప్పుడు తొలిగించే పనులు చేపట్టాలని సూచించారు. క్లోరినేషన్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. జ్వరపీడితులను గుర్తించి స్థానికంగా ఉన్న వైద్య సిబ్బందికి సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ యం.యర్రయ్య, వైద్యులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.