కారేపల్లి, మహా : పంటలకు యూరియా కొరతను రైతలను వేధిస్తుందని దానిని వెంటనేతీర్చాలని తెలంగాణరైతు సంఘం మండల అధ్యక్షకార్యదర్శులు ముండ్ల ఏకంబరం, వజ్జా రామారావులు డిమాండ్ చేశారు. శనివారం వారు విలేకరులతో మాట్లాడుతూ యూరియా కోసం రైతులు పడికాపులు కాస్తున్నారన్నారు. కారేపల్లి మండలంలో యూరియా ను కారేపల్లిలో ఉన్న సోసైటీ, రైతు ఆగ్రోస్ ల ద్వారా అమ్మకాలు సాగిస్తున్నారన్నారు. అరకొరగా స్టాక్ వస్తుండటంతో దూరప్రాంతాలైన రేలకాయలపల్లి, చీమలపాడు, కమలాపురం, మాధారం రైతులు మండల కేంద్రానికి వచ్చే లోపే యూరియా నిల్వలు అయిపోతున్నాయన్నారు. దీంతో రైతులు ఏమి చేయాలో తెలియని పరిస్ధితి వచ్చిందన్నారు. ప్రభుత్వం యూరియా అమ్మకం కేంద్రాలను పెంచాలని డిమాండ్ చేశారు. యూరియాను అందుబాటులో ఉంచి రైతులకు అవసరానికి తగిన విధంగా ఇవ్వాలన్నారు. ఈకార్యక్రమంలో నాయకులు పాసిన్నినాగేశ్వరరావు, అన్నారపు కృష్ణ, ముక్కా సీతారాములు, పండగ కొండయ్య, కరపటి సీతారాములు, ఎరిపోతు భద్రయ్య, వల్లభినేని మురళి తదితరులు పాల్గొన్నారు.







