Mahaa Daily Exclusive

  పవన్ కల్యాణ్‌కు భారీ ఊరట..

Share

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు భారీ ఊరట లభించింది. వాలంటీర్లపై వ్యాఖ్యల కేసులో హైకోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసును క్వాష్ చేయాలంటూ పవన్ దాఖలు చేసిన పిటిషన్ పై ఉన్నత న్యాయస్థానం స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు మాత్రమే కాకుండా ఇలాంటి మరికొన్ని కేసులను ప్రభుత్వం రివిజన్ చేస్తుందంటూ ఏజీ హైకోర్టుకు వివరించారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని కేసు విచారణపై స్టే విధిస్తూ తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది హైకోర్టు.