రేవంత్ రెడ్డి నాకు మిత్రుడేనని, పదేళ్ల కిందటి నుంచే మా మధ్య చెడిందని కేటీఆర్ అన్నారు. అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చలో భాగంగా కేటీఆర్ మాట్లాడారు. ప్రస్తుతం ద్రవ్య వినిమయ బిల్లుపై అసెంబ్లీ హాట్ డిబేట్ నడుస్తోంది. మూసీ ప్రాజెక్టుతో బాగుపడేదెవరు? వచ్చే లాభం ఎంత ? అని కేటీఆర్ అన్నారు. పాలసీలు కాదు..కేసీఆర్ అంటేనే జెలసీ మాత్రమే కనిపిస్తోందని కేటీఆర్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పగా చేయాలని కోరుకుంటున్నట్లు కేటీఆర్ అన్నారు. న్యూయార్క్ కంటే గొప్పగా చేస్తామంటున్నారు..చాలా సంతోషమన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు మేం కూడా చెల్లించామని గుర్తు చేశారు.
నేను విదేశాల్లో చదివానని, రేవంత్ అదృష్టం కొద్దీ సీఎం అయ్యారని కేటీఆర్ వెల్లడించారు. ఆదానీని రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తే.. రేవంత్ వెల్కమ్ చెబుతున్నారని, అయితే పెట్టుబడుల విషయంలో సీఎం జాగ్రత్తగా వ్యవహరించాలని కేటీఆర్ సూచించారు. బస్సు ప్రయాణం మంచిదే కానీ.. ఆటో డ్రైవర్లను ఆదుకోవాలన్నారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో పత్రికల స్టేట్ మెంట్స్ తీసుకురావడం సరికాదన్నారు. అనంతరం ఉచిత బస్సు ప్రయాణంపై బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తుందని మంత్రి పొన్నం అన్నారు. మహిళలను అవమానించడం సరికాదని, అవహేళన వీడియోలు సృష్టించిన వారిని ఉపేక్షించమని మంత్రి అన్నారు.
మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వలేదని మమ్మల్ని అంటున్నారని, 2014-19 వరకు ఒక్క మహిళకు మంత్రి పదవి ఇవ్వలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.