తనపై నటి లావణ్య చేసిన ఆరోపణలపై సినీ హీరో రాజ్ తరుణ్ స్పందించాడు. తనపై లావణ్య చేసినవి ఆరోపణలు మాత్రమేనని… కానీ ఎక్కడా ఆధారాలు చూపించలేదన్నారు. లావణ్య తనపై ఆరోపణలు చేసినప్పుడు మీడియా ఆధారాలను ఎందుకు అడగలేదని ప్రశ్నించారు.
తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు. తాను లీగల్‌గా వెళుతున్నానని, తనకు భయపడాల్సిన అవసరం లేదన్నారు. లావణ్య పెట్టిన ఎఫ్ఐఆర్‌లో గర్భస్రావంపై కేసు ప్రస్తావన ఎందుకు లేదన్నారు. తాను తప్పించుకొని తిరగడం లేదన్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు తనకు నోటీసులు ఇచ్చారని, ఆ నోటీసులపై తానూ స్పందించానన్నారు.
తానూ మనిషినేనని… అనవసర ఆరోపణలతో తనకూ బాధ ఉంటుందన్నారు. వాళ్లలాగా తాను మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేనన్నారు. మన మంచితనాన్ని ఆసరాగా చేసుకొని ఇలా చేస్తే బాధ వేయదా? అన్నారు. ఆ బాధతో ఇన్నాళ్లూ బయటకు రాలేదన్నారు.
తాను మామూలుగానే సెన్సిటివ్ అని… అందుకే బయటకి రాలేదన్నారు. తాను అలాగే ఇంట్లో ఉంటుంటే తన కుటుంబ సభ్యులపై కూడా ప్రభావం పడుతోందన్నారు. అందుకే ఈ రోజు మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నానని మీడియాతో అన్నారు. తాను ఎంతో ధైర్యం తెచ్చుకొని… బయటకు వచ్చానన్నారు. ఇంకా అడిగి బాధపెట్టవద్దని కోరారు