Mahaa Daily Exclusive

  జగన్‌కు మరిన్ని కష్టాలు, మరో పార్టీ ఆఫీసు మూసివేత..!

Share

ఎన్నికల్లో ఓటమి పాలైనా వైసీపీ అధినేత జగన్ వ్యవహారశైలి మారలేదా? కేడర్‌కు ధైర్యం చెప్పాల్సిన అధినేత.. ఎందుకు దూరంగా ఉండాలనుకుంటున్నారు? అధికారం కోల్పోయా క వైసీపీకి కష్టాలు రెట్టింపు అయ్యాయా? ఓ వైపు నేతల వలసలు.. మరో వైసీపీ ఆఫీసుల మూతవేతలు.. అసలు వైసీపీలో ఏం జరుగుతోంది?

 

వైసీపీ అధినేత జగన్ కట్టిన సామ్రాజ్యం కూలిపోతుందా? ఓటమి తర్వాత నేతలు, కార్యకర్తలకు ధైర్యం చెప్పాల్సిన అధినేత వారికి దూరంగా ఉంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్యాలెస్ దాటి రాలేదు జగన్. అధికారం కోల్పోయిన తర్వాత నేతలు, కార్యకర్తలకు దూరంగా ఉంటున్నాడు. దీనికి కారణమేంటని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు రకరకాలు చర్చించుకోవడం మొదలైంది.

 

కుప్పంలో వైసీపీ ఆఫీసు ఇప్పటికే క్లోజ్ అయ్యింది. ఇప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లా మైలవరం టీడీపీ ఆఫీసు వంతైంది. ఎన్నికలకు ముందు ఆ నియోజకవర్గం సమన్వయకర్తగా సర్నాల తిరుపతిరావును హైకమాండ్ ప్రకటించింది. నాగిరెడ్డికి చెందిన భవంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. భారీ హోర్డింగ్‌లు ఏర్పాటు చేసి అక్కడి నుంచే ప్రచారం మొదలుపెట్టారు.

 

పార్టీ కార్యాలయ నిర్వహణ బాధ్యత అంతా పార్టీ హైకమాండ్ చూసుకుంది. గత ఎన్నికల్లో ఈ నియోజక వర్గం నుంచి టీడీపీ గెలిచింది. దీంతో రెండు నెలలుగా పార్టీ కార్యాలయం వైపు ఎవరూ తొంగి చూడలేదు. ఆ పార్టీ నియమించిన ముగ్గురు పరిశీలకులు అందుబాటులో లేరు. శనివారం రాత్రి పార్టీ కార్యాలయంలో ఉన్న ఫ్లెక్సీలు, హోర్డింగులను తొలగించారు.

 

ఇప్పటికే ఆ పార్టీలో ఉన్న దిగువస్థాయి నేతలు, కార్యకర్తలు… టీడీపీ నేతలతో మంతనాలు సాగిస్తున్నార ట. రేపోమాపో సైకిల్ ఎక్కాలని భావిస్తున్నారు. కార్యకర్తలు సైతం పార్టీ ఆఫీసు ముఖం చూడలేదు. ఆ నియోజకవర్గంలో కొంతమంది నేతలు తమ దారి చూసుకునే పనిలోపడ్డారని అంతర్గత సమాచారం. రేపోమాపో ఉత్తరాంధ్రలో వైసీపీకి చెందిన ఓ ఆఫీసు కూడా మూతపడుతుందనే ప్రచారం జోరందుకుంది. ఈ గండం నుంచి ఎలా గట్టెక్కాలనే దానిపై జగన్ కీలక నేతలతో మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.