Mahaa Daily Exclusive

  వాయుసేన నూతన ‘అస్త్ర మార్క్ 1’మిసైల్స్..

భారత సైన్యంలో వాయుసేనకు ఎంతో ప్రత్యేకత ఉంది. గగన మార్గం నుంచి శత్రు స్థావరాలను దుర్భేద్యం చేసి దేశ రక్షణలో కీలక పాత్ర వహించేదే వాయుసేన. ఇప్పటిదాకా విదేశీ సాంకేతిక పరిజ్ణానంపై ఆధారపడిన వాయుసేన సొంతంగా స్వదేశీ టెక్నాలజీతో తయారుచేసుకునే మిస్సైళ్ల ను తయారు చేయడానికి శ్రీకారం చుట్టింది. శత్రు శిబిరాలపై ఆకాశం నుండి ప్రయోగించే ‘అస్త్ర మార్క్ 1’మిసైల్స్ ను తయారుచేయాలని హైదరాబాద్ లో నెలకొల్పిన భారత్ డైనమిక్స్ లిమిటెడ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గగనతలంలో వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని అవలీలగా ఛేదించగలిగిన సామర్థ్యం అస్త్ర మార్క్ 1 కి ఉంది.

 

స్వదేశీ పరిజ్ణానంతో..

 

గగనతలం నుంచి గగన తలంలోకి అస్త్రాలను ప్రయోగించే దేశాల సరసన ఇండియా కూడా చేరింది. ఇటీవల భారత వాయుసేన డిప్యూటీ చీఫ్ అశుతోష్ దీక్షిత్ హైదరాబాద్ పర్యటనలో భాగంగా బీడీఎల్ సందర్శించారు. ఈ సందర్భంగా బీడీఎల్ కు అస్త్రా మార్క్ 1కు సంబంధించి 200 మిస్సైళ్లు తయారు చేయవలసిందిగా ఆదేశాలు ఇచ్చారు. ఈ 200 మిస్సైళ్లకు దాదాపు రెండు వేల తొమ్మిది వందల కోట్లు ఖర్చవుతాయని రక్షణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అస్త్ర మార్క్ 1 ఎలా పనిచేస్తుందో అన్ని కీలక పరీక్షలు నిర్వహించారు. పరీక్షలన్నీ విజయవంతం కావడంతో ఇప్పుడు 200 మిస్సైళ్లకు రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విదేశీ మిస్సైళ్లకు ధీటుగా ఏ మత్రం క్వాలిటీ తగ్గని విధంగా పూర్తిగా స్వదేశీ పరిజ్ణానంతో ఈ మిస్సళ్లను తయారు చేయనున్నారు. ఇప్పటికే భారత్ లో ధీటైన స్వదేశీ యుద్ధ విమానం తేజస్ కు రూపకల్పన జరిగింది. ఇప్పుడు కొత్తగా అస్త్ర మార్క్ 1 మిస్సైళ్ల తయారీతో భారత రక్షణ దళం మరో మెట్టు పైకి ఎదిగినట్లే అని భావిస్తున్నారంతా.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share