Mahaa Daily Exclusive

  జామ ఆకులతో యవ్వనం..

Share

మహా: ప్రస్తుతం బిజీబిజీ జీవితంలో అనారోగ్యాలు దరిచేరుతున్నాయి. రకరకాల రోగాలతో జనాలు బాధపడుతున్నారు. ఆనాటి రోజుల్లో ప్రకృతిని నమ్ముకుని మనిషి జీవించేవాడు. తనకు ఏది కావాలన్నా ప్రకృతిపైనే ఎక్కువగా ఆధారపడేవారు. ప్రకృతిలో దొరికే వృక్షాలు, పండ్లను తినడమే కాదు.. వాటి ఆకులు కూడా ఎంతో ఉపయోగపడుతాయి. వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఆ విధంగా ఉపయోగించుకునేవారు నాటి రోజుల్లో. కానీ, ప్రస్తుతం చాలామందికి ఈ విషయాలేవీ తెలియడంలేదు. అందులో ఒకటి జామ ఆకు. ఈ ఆకు గురించి చాలామందికి తెలియదు. దీంతో జామ పండ్లను మాత్రమే తింటుంటారు. వాటి ఆకులను పడేస్తుంటారు. కానీ, వాటి వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఇందుకు సంబంధించి పలువురు నిపుణులు చెప్పినదాని ప్రకారం.. మొదటగా జామ ఆకులను తీసుకోవాలి. వాటిని శుభ్రంగా కడగాలి. ఆ తరువాత వాటిని నీటిలో పది నిమిషాలపాటు మరిగించాలి. ఆ తరువాత ఆ నీటిని వడకట్టి అందులో కొద్దిగా నిమ్మరసం, తేనేను యాడ్ చేయాలి. అలా కలిపిన తరువాత ఆ నీటిని తాగాలి. ఇలా తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. మీరు నిత్యం యవ్వనంగా కనిపిస్తారు. ముఖం మీద మొటిమలు, మచ్చలు మటుమాయమైపోతాయి. ఫేస్, శరీరం ఎప్పుడూ మెరుస్తూ కనిపిస్తుంది. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. కొలెస్ట్రాల్ విషయంలో కూడా జామ ఆకులు కీలక పాత్ర పోషిస్తాయి. పూర్తిగా తగ్గుతుంది. కడుపు నొప్పి, నడుం నొప్పిని కూడా తగ్గిస్తాయి. పలు రోగాలను కూడా జామ ఆకులు నయం చేయడంలోనూ హెల్ప్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు.