Mahaa Daily Exclusive

  మీరు అనుకున్నది ఎప్పటికీ జరగదు..ఇండియా కూటమిపై అమిత్ షా సెటైర్లు..

Share

విపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా మరో సారి 2029లో కూడా ఎన్టీయే ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని అమిత్ షా అన్నారు. మరో సారి మోదీ ప్రధాని అవుతారని స్పష్టం చేశారు. చండీఘడ్‌లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. 24 గంటల మంచి నటి సరఫరా ప్రాజెక్టును కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రారంభించిన అనంతరం జరిగిన సభలో ప్రసంగించారు.

 

గత మూడు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుచుకున్న స్థానాల కంటే బీజేపీ ఈ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలిచిందనే విషయం వారికి తెలియదని ఎద్దేవా చేశారు. అస్థిరతను కోరుకుంటున్న నేతలు తరుచూ మోదీ ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగదని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం అయిదేండ్ల పదవీ కాలం పూర్తి చేయడంతో పాటు రానున్న ఎన్నికల్లోనూ విజయం సాధించి తీరుతుందన్నారు. మరో సారి ఎన్డీయే ప్రభుత్వం కొలువు తీరుతుందని పేర్కొన్నారు.

 

ఇండియా కూటమి మరోసారి విపక్షంలో కూర్చునేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు. విపక్ష పాత్ర పోషించడం గురించి ఇండియా కూటమి నేతలు నేర్చుకోవాలని హితవు పలికారు. ఇండియా కూటమి ఏం చేసినా అధికారంలోకి రావడం అస్సలు జరగదని అన్నారు.