Mahaa Daily Exclusive

  జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక :నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ షురూ

Share

  • జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక
  • నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ షురూ
  • షేక్ పేట తహసిల్ధార్ కార్యాలయంలో ఆర్ వో కార్యాలయం ఏర్పాటు

హైదరాబాద్, మహా : జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. ఎన్నికల సంఘం నేడు ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నది. దీంతో సోమవారం నుంచి 21వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ చేపట్టనున్నారు. 22 న నామినేషన్లు పరిశీలన కాగా.. 24 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇవ్వనున్నారు. నామినేషన్ల స్వీకరణకు సర్వం సిద్ధం చేసిన జిల్లా ఎన్నికల సంఘం. షేక్ పేట్ తహసిల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఏర్పాటు చేశారు. జిల్లా ఎన్నికల అధికారి ఆర్ వి కర్ణన్ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఏర్పాట్లను పరిశీలించారు. సికింద్రాబాద్ ఆర్డీఓ సాయిరాం రిటర్నింగ్ అధికారిగా నామినేషన్లు స్వీకరించనున్నారు. వచ్చేనెల 11 ఉప ఎన్నిక పోలింగ్ జరగనున్నది. పోలింగ్ అనంతరం 14వ తేదీన ఓట్ల కౌంటింగ్ చేయనున్నారు. ఉపఎన్నిక నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరును ప్రకటించగా, బీఆర్ఎస్ దివంగత ఎమ్మెల్యే మాగంటిగోపీనాథ్ భార్య సునిత పేరును ప్రకటించాయి. నేడో రేపో బీజేపీ బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల కోలాహలం నెలకొంది.

Latest