Mahaa Daily Exclusive

  తెలంగాణ బీసీ జేఏసీ ఏర్పాటు .. ఛైర్మన్‌గా ఆర్‌.కృష్ణయ్య ,వైస్ ఛైర్మన్ గా నారగోని, వర్కింగ్ ఛైర్మన్ గా జాజుల

Share

హైదరాబాద్‌, మహా : తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా రాష్ట్రంలోని బీసీ సంఘాల ఆధ్వర్యంలో ‘తెలంగాణ బీసీ జేఏసీ’ ఏర్పాటు చేశారు. జేఏసీ ఛైర్మన్‌గా ఆర్‌.కృష్ణయ్య, వైస్‌ ఛైర్మన్‌గా వీజీ నారగోని వ్యవహరించనున్నారు. బీసీ జేఏసీలో ముఖ్యమైన ఆరుగురితో కమిటీని కూడా ఏర్పాటు చేశారు. జాజుల శ్రీనివాస్ గౌడ్- వర్కింగ్ చైర్మన్ గా, రాజారాం యాదవ్- కో చైర్మన్, దాసు సురేశ్- కో చైర్మన్ , గుజ్జ క్రిష్ణ-మీడియా కోఆర్డినేటర్ గా వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా ఆర్‌. కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీల నినాదాన్ని బలంగా ముందుకు తీసుకెళ్లాలని, రాష్ట్రంలో ఉద్యమం బలంగా జరిగితే.. కేంద్రంపై ప్రభావం పడుతుందని అన్నారు. 42 శాతం రిజర్వేషన్లలో ఏ అంశం మీద కోర్టు స్టే ఇచ్చిందని కృష్ణయ్య ప్రశ్నించారు. ‘‘ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడ్డాక స్టే ఇవ్వకూడదు. బీసీలకు న్యాయం కోసం ఈ నెల 18న బంద్‌కు పిలుపునిచ్చాం. అన్యాయాన్ని 76 ఏళ్లుగా బీసీలు భరిస్తూ వస్తున్నారు. బీసీలకు అన్యాయంతోపాటు ఇప్పుడు అవమానం జరిగింది. చట్టసభల్లో బిల్లు పెట్టే వరకు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్దాం’’ అని కృష్ణయ్య పిలుపునిచ్చారు.