Mahaa Daily Exclusive

  బీహార్‌లో తేలిన ఎన్డీయే లెక్క..ఆర్‌ఎల్‌ఎం, హెచ్‌ఏఎం తలో ఆరు సీట్లు కేటాయిస్తూ ఎన్డీయే నిర్ణయం

Share

  • బీహార్‌లో తేలిన ఎన్డీయే లెక్క
  • బీజేపీ, జేడీయూ, ఎల్జేపీ వాటాలు ఖరారు
  • బీజేపీ, జేడీయూ తలో 101 సీట్లలో పోటీ.. లోక్ జన్ శక్తికి 29 కేటాయింపు
  • ఆర్‌ఎల్‌ఎం, హెచ్‌ఏఎం తలో ఆరు సీట్లు కేటాయిస్తూ ఎన్డీయే నిర్ణయం

బీహార్, మహా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే సీట్ల పంపకాలు ఖరారు అయ్యాయి. బీహార్‌లో అత్యధిక సీట్లలో పోటీ చేసేందుకు ఎన్డీయే కూటమి పార్టీలైన బీజేపీ, జేడీయూ తీవ్ర ప్రయత్నాలు చేశాయి. అయితే పొత్తు చర్చల్లో ఇరు పార్టీలు వెనక్కి తగ్గకపోవడంతో చివరికి తలో 101 సీట్లలో పోటీ చేసేందుకు ఒప్పందం కుదిరింది. కూటమిలో మరో కీలక పార్టీ అయిన చిరాగ్ పాశ్వాన్‌కు చెందిన లోక్ జన్ శక్తికి 29 సీట్లు ఇచ్చేందుకు ఇరు పార్టీలు అంగీకరించాయి. బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 సీట్లు ఉన్నాయి. ఇందులో బీజేపీ, జేడీయూ ఇద్దరూ సమానంగా తలో 101 సీట్లలో పోటీ చేయనుండగా.. మరో 29 సీట్లు ఎల్జేపీకి దక్కాయి.
మిగిలిన సీట్లలో ఉపేంద్ర కుశ్వాహాకు చెందిన రాష్ట్రీయ లోక్ మోర్చాకు, జీతన్ రామ్ మాంఝీకి చెందిన హిందుస్థాన్ అవామ్ మోర్చాకు తలో ఆరు సీట్లు కేటాయించారు. ఈ విషయాన్ని బీజేపీ నేత ధర్మేంద్ర ప్రధాన్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. బీహార్ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించేందుకు అధికార ఎన్డీయే కూటమి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం భారీగా పథకాలను కూడా ప్రకటిస్తోంది. రాష్ట్రంలో మహిళల ఓట్లతో పాటు ఇతర వర్గాలను కూడా దగ్గర చేసుకునేందుకు వీలుగా సీఎం నితీశ్ కుమార్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు విపక్ష ఇండియా కూటమి నుంచి వీరికి గట్టి పోటీ లభిస్తోంది. సీఎంగా విపక్ష నేత తేజశ్వీ యాదవ్ గట్టిపోటీ ఇస్తున్నారు.

జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ): 101 సీట్లు
భారతీయ జనతా పార్టీ (బీజేపీ): 101 సీట్లు
లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్): 29 సీట్లు
హిందుస్తానీ అవామ్ మోర్చా (హెచ్‌ఏఎం): 6 సీట్లు
రాష్ట్రీయ లోక్ మోర్చా (ఆర్‌ఎల్‌ఎం): 6 సీట్లు