Mahaa Daily Exclusive

  మంత్రుల మధ్య విభేదాలు చిన్న విషయమే:ఢిల్లీలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్.

Share

  • మంత్రుల మధ్య విభేదాలు చిన్న విషయమే
  • మా కుటుంబ సమస్యలు మేమే పరిష్కరించుకుంటాం
  • ఢిల్లీలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్.

న్యూఢిల్లీ, మహా : కాంగ్రెస్ మంత్రుల మధ్య విభేదాలు ఆందోళన చెందాల్సినంత పెద్ద అంశాలు కాదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. అది చాలా చిన్న విషయమని చెప్పారు. మంత్రుల మధ్య వివాదాలు అనేవి తమ కుటుంబ సమస్య అని, దానిని తామే పరిష్కరించుకుంటామని తేల్చి చెప్పారు. మంత్రుల మధ్య విభేదాలకు సమాచారలోపమే కారణమన్నారు. వాటిపై దృష్టి సారించామని, అన్ని సమస్యలు అతి త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే‌కు వైద్యులు ఇటీవల పేస్‌మేకర్‌ను అమర్చారు. ఈ నేపథ్యంలో సోమవారం ఖర్గేను మహేష్ కుమార్ గౌడ్.. ఢిల్లీలో కలిసి పరామర్శించారు. ఈ భేటీ అనంతరం ఆయన తెలంగాణలో మంత్రుల మధ్య తలెత్తిన వివాదాలు, విభేదాలపై స్పందించారు. ఆ పరిణామాలను ఖర్గేకు వివరించినట్లు చెప్పారు. అన్ని సమస్యలను అతి త్వరలోనే పరిష్కరిస్తామని కూడా వెల్లడించారు. ఖర్గే ప్రస్తుతం సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారన్నారు.

బీసీ రిజర్వేషన్లపై త్వరలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తాం

రాష్ట్రంలోని ఇటీవల పరిణామాలపై ఖర్గేకు వివరించడం జరిగిందన్నారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో జరిగిన వ్యవహారాన్ని ఖర్గే దృష్టికి తీసుకెళ్లానని, సుప్రీం కోర్ట్ లో అప్పీల్ చేయాలనుకుంటున్న అంశాన్ని కూడా వివరించడం జరిగిందన్నారు. సుప్రీంకోర్టులో వీలైనంత త్వరలో బీసీ రిజర్వేషన్ల విషయంలో పిటిషన్ ఫైల్ చేస్తామని తెలిపారు. ఇప్పటికే ఈ విషయంలో సీఎంతో పాటు ఇతర ముఖ్య నేతల జూమ్ సమావేశం జరిగిందని తెలిపారు.
ప్రభుత్వం వేసే పిటిషన్ కు కాంగ్రెస్ పార్టీలోని నాయకులు కూడా ఇన్ఫీల్డ్ అవుతారన్నారు.

Latest