- ఒక్కో దరఖాస్తుకు రూ.3 లక్షలు పెడితే ఎలా?
- లాటరీలో షాప్ దక్కకపోతే డబ్బులు తిరిగిచ్చేలా ఆదేశించాలి
- తెలంగాణలో కొత్త మద్యం పాలసీపై హైకోర్టులో పిటిషన్
హైదరాబాద్, మహా: తెలంగాణలో కొత్త మద్యం పాలసీపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అనిల్‌కుమార్ అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశాడు. ఒక్కో దరఖాస్తుకు రూ.3 లక్షల రుసుం పెట్టారని పిటిషన్‌లో అభ్యంతరం వ్యక్తం చేశాడు. లాటరీలో షాపు దక్కకపోతే రూ.3 లక్షలు అబ్కారీ శాఖకే వెళ్తాయని.. డబ్బును తిరిగిచ్చేలా ఆ శాఖను ఆదేశించాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశాడు. లిక్కర్ పాలసీపై జారీ చేసిన జీవోను కొట్టివేయాలని కోరాడు. దీనిపై ఆబ్కారీశాఖ కమిషనర్‌కు నోటీసులు జారీ చేస్తూ విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.
Post Views: 66








