Mahaa Daily Exclusive

  రాష్ట్రం వస్తే జాబ్స్ వస్తాయని నిరుద్యోగులను బలిగొన్న చరిత్ర….కేటీఆర్ వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఫైర్

Share

  • పదేళ్లలో కేసీఆర్ ఫ్యామిలీకే ఉద్యోగాలు
  • రాష్ట్రం వస్తే జాబ్స్ వస్తాయని నిరుద్యోగులను బలిగొన్న చరిత్ర
  • అహనా పెళ్ళంట మాట బీఆర్ఎస్ పార్టీకి సరిగ్గా సరిపోతుంది
  • కేటీఆర్ వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఫైర్

 

హైదరాబాద్, మహా: అహనా పెళ్ళంట మాట బీఆర్ఎస్ పార్టీకి సరిగ్గా సరిపోతుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌కు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. సినిమాలో మాదిరి కోడిని వేలాడదీసి ఆశ చూపినట్లు నిరుద్యోగులకు ఉద్యోగాల ఆశ చూపి.. కేబినెట్‌లో ఐదేళ్లు మహిళా మంత్రి లేకుండా ప్రభుత్యం నడిపిన నీచ చరిత్ర బీఆర్ఎస్ పార్టీది అని దుయ్యబట్టారు. జూబ్లీ‌హిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్‌తో లోపాయికారి ఒప్పందంలో భాగంగానే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీజేపీ ప్రాధాన్యత లేని అభ్యర్థిని నిలబెట్టిందని ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 8 సీట్లు గెలవడానికి బీఆర్ఎస్ సహకరించిందని ఆరోపించించారు. ఈ మేరకు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు.

బీఆర్ఎస్ పార్టీ రుణం తీర్చుకోవడానికి బీజేపీ ప్రాధాన్యత లేని అభ్యర్థిని నిలబెట్టిందని దుయ్యబట్టారు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రతి నిర్ణయంలో గులాబీ బాస్, మాజీ సీఎం కేసీఆర్ పాత్ర ఉందని ఆరోపించారు. రాష్ట్రపతి అధ్యక్ష పదవిని నుంచి మొదలుకొని ట్రిపుల్ తలాక్ వరకు బీజేపీకి కేసీఆర్ మద్దతు ఇచ్చారని అన్నారు. డబ్బుతో ఓట్లను కొలవడమనేది అనైతిక చర్య అని పేర్కొన్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చే రూ.5 వేలు తీసుకోండి.. బీఆర్ఎస్ పార్టీకి ఓటేయండి? అంటూ కేటీఆర్ మాట్లాడటం ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే చర్యగా పేర్కొన్నారు. ఎలక్షన్ కమిషన్ తక్షణమే కేటీఆర్ పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను మెజార్టీ అమలు చేశామన్నారు. కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేసి ఓట్లు అడుగుతుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని అమాయకులైన నిరుద్యోగులను బలిగొన్న చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని ఫైర్ అయ్యారు. పదేళ్ల పాలనలో కేసీఆర్ కుటుంబంలో వారికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని మండిపడ్డారు.

Latest