Mahaa Daily Exclusive

  తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్‌కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్

Share

ఐపీఎల్ 2024 సీజన్‌లో వరుసగా రెండో పరాజయాన్ని చవి చూసింది. గురువారం రాత్రి జైపూర్‌లో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో చిత్తుగా ఓడింది.

12 పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడింది డీసీ. సున్నా పాయింట్లతో టేబుల్‌లో ఎనిమిదో స్థానంలో నిలిచింది.

ఆదివారం తన తదుపరి మ్యాచ్‌ను ఆడబోతోంది డీసీ. బలమైన చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. విశాఖపట్నంలో సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ షెడ్యూల్ అయింది. వరుసగా రెండు మ్యాచ్‌లల్లో గెలిచి కాక మీద ఉన్న చెన్నై సూపర్ కింగ్స్‌ను ఢీకొట్టి గెలవడం అంటే అంత ఈజీ కాదు.

 

జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో గులాబీ జెండా ఎగిరిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్.. నిర్ణీత 20 ఓవర్లల్లో అయిదు వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ బ్యాటర్ రియాన్ పరాగ్.. 84 పరుగులతో దుమ్ము లేపాడు. 45 బంతుల్లో ఆరు సిక్సర్లు, ఏడు ఫోర్లతో చెలరేగాడు.

అనంతరం ఛేజింగ్‌కు దిగిన ఢిల్లీ కేపిటల్స్ ఈ లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. 173 పరుగుల వద్దే నిలిచిందా జట్టు ప్రస్థానం. ఢిల్లీ కేపిటల్స్‌కు వరుసగా రెండో ఓటమి ఇది. తొలి గేమ్‌లో పంజాబ్ కింగ్స్ చేతిలో పరాజయం పాలైంది. ప్రత్యర్థి టీమ్ మారినా దాని ఫేట్ మాత్రం ఛేంజ్ కాలేదు.

ఈ ఓటమిపై టామ్ మూడీ స్పందించాడు. దీనికి నైతికి బాధ్యత ఢిల్లీ కేపిటల్సే బాధ్యత వహించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించాడు. ఈ రెండు ఓటములకు ప్రధాన కారణం.. స్వయంకృతాపరాథమేనని పేర్కొన్నాడు. జట్టు కూర్పులో ఏ మాత్రం సెన్స్ లేకుండా వ్యవహరిస్తోందంటూ మండిపడ్డాడు.

పృథ్వీ షా వంటి టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్‌ను బెంచ్‌కే పరిమితం చేయడాన్ని తప్పు పట్టాడు టామ్ మూడీ. టీ20ల్లో అంతర్జాతీయ మ్యాచ్‌లను ఆడిన అనుభవం ఉన్న పృథ్వీ షాను డగౌట్‌లో కూర్చోబెట్టడం సరైన వ్యూహం అనిపించుకోదని పేర్కొన్నాడు. పృథ్వీ షా సరిగ్గా ఆడట్లేదనే కారణాన్ని చూపడం సరికాదని, డగౌట్‌లో కూర్చున్న ప్లేయర్ ఎలా స్కోర్ చేయగలుగుతాడని ఎద్దేవా చేశారు.

ఢిల్లీ కేపిటల్స్ ఆడిన తొలి రెండు మ్యాచ్‌లల్లో పృథ్వీ షాకు చోటు దక్కలేదనే విషయం తెలిసిందే. రీకీ భుయ్‌ను తుదిజట్టులోకి తీసుకుంది. అతను మాత్రం ఆశించిన స్థాయిలో ఆడట్లేదు. తొలి గేమ్‌లో మూడు, రెండో మ్యాచ్‌లో సున్నా పరుగులకు అవుట్ అయ్యాడు. అంతర్జాతీయ మ్యాచ్‌లను ఆడిన అనుభవం ఉన్న పృథ్వీ షాను ప్లేయింగ్ 11లోకి తీసుకోకపోవడం సరికాదని అన్నాడు.