- రూ. 12 వేల కోట్ల డ్రగ్స్ స్వాధీనం
హైదరాబాద్, మహా : డ్రగ్స్ రహిత తెలంగాణగా రాషఅట్రాన్ని మార్చాలన్న సంకల్పంతో ఉన్న తెలంగామ పోలీసులు అందివచ్చిన ఏ ఒక్క వకాశాన్ని వదులుకోవడం లేదు. కొన్నాళ్ళ క్రితం హైదరాబాద్ లోని వేర్వేరు ప్రాంతాలలో ఈగల్ టీం, యాంటీ నార్కొటిక్ టీంలు దాడులు జరిపి పలువురు నైజీరియన్లను అరెస్ు చేశాయి. వీరి విచారణలో వెల్లడైన సమాచారం ఆధారంగా దేశ రాజధాని న్యూఢిల్లీలో ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులతో కలిసి సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి కీలక అంశాలను వెలుగులోకి తీసుకు వచ్చారు. న్యూఢిల్లీలోని 20 ప్రాంతాల్లో గడువు తీరిన 50 మందికిపైగా నైజీరియన్లు ఉంటున్నట్లు గుర్తించడంతో పాటు నోయిడా, గ్వాలియర్, విశాఖపట్నం తదితర నగరాల్లో ఈ డ్రగ్స్‌తో సంబంధాలు ఉన్న కీలక నిందితులను అరెస్ట్ చేసింది.
నాలుగు ప్రాంతాల్లో 5,340 ఎక్స్ సిటీ మాత్రలు, 250 గ్రాముల కొకైన్, 109 గ్రాముల హెరాయిన్, 250 గ్రాముల మెథాంఫెటమైన్‌ను సీజ్ చేసింది. ఢిల్లీలోని 59 మ్యూల్ ఖాతాలతోపాటు 16 డ్రగ్స్ కేంద్రాలను గుర్తించింది. ఇక నైజీరియాకు చెందిన 107 బ్యాంకు ఖాతాలు ఈగల్ టీమ్ స్తంభింప జేసింది. మల్నాడు రెస్టారెంట్, మహీంద్రా యూనివర్సిటీ కేసులో నైజీరియన్ నిక్‌ను అరెస్ట్ చేసి వచారించిన సందర్భంగా సేకరించిన సమాఛారం ఆధారంగా దేశవ్యాప్తంగా ఈ ముఠాతో దాదాపు 2 వేలకు పైగా డ్రగ్స్ వినియోగదారులు,పెడ్లర్లు ఉన్నట్లు ఈగల్ టీం గుర్తించింది. ఢిల్లీ నుంచి డ్రగ్స్ పార్శిళ్లు.. బూట్లు, దుస్తులు, కాస్మోటిక్ వస్తువులు, చెప్పులు మధ్యలో డ్రగ్స్ పెట్టి కొరియర్ ద్వారా సప్లై చేసినట్లు పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది. శ్రీ మారుతి కొరియర్స్, డీటీడీసీ, ప్రొఫెషనల్ కొరియర్స్, షిప్ రాకెట్, ఇండియా పోస్ట్, ఢిల్లీ వేరీ, బ్లూ డార్ట్, ట్రాక్ ఆన్ తదితర కొరియర్స్ నెట్‌వర్క్‌ను ఈ నైజీరియన్ ముఠా ఉపయోగించినట్లు ఈ కేసు విచారణలో బహిర్గతమైంది.
మరికొద్ది రోజుల్లో నూతన సంవత్సర వేడుకలు ప్రారంభం కానున్న నేపథ్యంలో డ్రగ్స్ కంట్రోల్‌కు ఈగల్ టీమ్ భారీ ఆపరేషన్ చేపట్టింది. ఈ సందర్భంగా అంతర్జాతీయ డ్రగ్స్ ఆపరేషన్‌ను ఛేదించింది. ఢిల్లీలో అరెస్ట్ చేసిన 50 మందిని హైదరాబాద్‌కు తరలించేందుకు ఈ టీమ్ ఇప్పటికే చర్యలు చేపట్టింది. వీరిని హైదరాబాద్‌కు తరలించిన తర్వాత కోర్టులో హాజరుపరచి తిరిగి అదుపులోకి తీసుకున్న విచారిస్తే మరింత సమాచారం వెల్లడవుతుందని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. ఈ విచారణలో వీరు చెప్పే కీలక ఆధారాలతో మరిన్ని అరెస్ట్‌లు జరిగే అవకాశం ఉందని సమాచారం.







