బాలానగర్ IDPL ల్యాండ్ స్కామ్ కేసు నమోదు..
* బాలానగర్‌లో IDPL భూములపై భారీ భూ ఆక్రమణ
* 400 కోట్లకు పైగా విలువైన భూముల ఆక్రమణపై పోలీస్ కేసు నమోదు
* TG IIC ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన బాలానగర్ పోలీసులు
* IDPLకు చెందిన 14 ఎకరాల కీలక భూమి అక్రమంగా ఆక్రమణ
* ప్రైవేట్ వ్యక్తులతో పాటు అధికారుల కుమ్మక్కు ఆరోపణలు
* IDPL, NIPER, రెవెన్యూ, ఎస్టేట్ అధికారులపై ఫిర్యాదులో తీవ్ర ఆరోపణలు
2020–2024 మధ్య జరిగిన సర్వేల్లో అక్రమాల అనుమానం
* తహసీల్దార్‌లు, వీఆర్‌ఓలు, సర్వేయర్ల పాత్రపై ఆరోపణలు
* కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, బాలానగర్ మండలాల్లో అక్రమ మార్పులు
* 2023లో అక్రమంగా పాస్‌బుక్స్ జారీ చేసినట్టు గుర్తింపు
* పంచనామాలు, సర్వే రికార్డుల్లో అనుమానాస్పద మార్పులు
* పంచనామాలు, రెవెన్యూ రికార్డులు మార్చి భూముల స్వాధీనం
* ఆక్రమణలను అడ్డుకోడంలో అధికారులు విఫలం
* బాధ్యులపై చర్యలు తీసుకోని అధికారుల పాత్రపై దర్యాప్తు
* 2003లో IDPL మూత… భూముల బదిలీల్లో అక్రమాలు
* 160 ఎకరాలు, మరో 110 ఎకరాలు NIPERకు బదిలీ
* సుమారు 195 ఎకరాల భూమికి ఇప్పటికీ పరిహారం లేదన్న ఆరోపణలు
* IDPL భూములపై విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ విచారణ
* రాజకీయ, మీడియా ఒత్తిళ్లతో వ్యవహారం నడిచిందన్న ఆరోపణలు
* పోలీసుల సమాంతర దర్యాప్తు కొనసాగింపు
* విజిలెన్స్ నివేదిక ఆధారంగా కీలక చర్యలకు అవకాశం
* బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని అధికారుల స్పష్టం








