- 25న జరిగే గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం మహాసభను జయప్రదం చేయండి
- -గ్రామీణ వైద్యుల హక్కుల సాధన కొరకే మహాసభ ఏర్పాటు
- –గ్రామీణ వైద్యులకు ప్రభుత్వం గుర్తింపునివ్వాలి
- — సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్ష పిట్టల నాగేశ్వరరావు
కారేపల్లి, మహా:నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందిస్తున్న గ్రామీణ వైద్యుల హక్కుల సాధన కొరకే ఈనెల 25న ఖమ్మం పట్టణంలోని కృష్ణ ఫంక్షన్ హాల్ లో 24 మహాసభను నిర్వహిస్తున్నట్లు గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల అధ్యక్షులు పిట్టల నాగేశ్వరరావు అన్నారు.శనివారం మండల కేంద్రమైన కారేపల్లిలో గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే 24వ మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ సంఘం జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు పిట్టల నాగేశ్వరరావు, అనంతారపు వెంకటాచారి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల పల్లెలలో ప్రతి నిమిషం ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందిస్తున్న గ్రామీణ వైద్యులకు గుర్తింపు ఇచ్చే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలన్నారు.గుర్తింపు నిచ్చేందుకు ఆర్.ఎం.పి పి ఎం పి లకు పారామెడికల్ బోర్డు ద్వారా శిక్షణా తరగతులు ఏర్పాటు చేసి పూర్తిస్థాయి శిక్షణ ఇచ్చి ప్రాథమిక వైద్యం చేసుకొనేందుకు సర్టిఫికెట్లు అందజేయాలన్నారు. ప్రభుత్వం అందించే వైద్య సేవలలో గ్రామీణ వైద్యులకు భాగస్వామ్యం కల్పిస్తే గ్రామస్థాయిలో పూర్తి విజయవంతం అవుతుందన్నారు.ఈ మహాసభకు విశిష్ట అతిథులుగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జి మంత్రి వాకిటి శ్రీహరి,డిసిసి అధ్యక్షులు నూతి సత్యనారాయణ,ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ఖమ్మం జిల్లా డీఎంహెచ్ఓ రామారావు,అనుభవ వైద్యుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు చొప్పరి శంకర్ ముదిరాజ్ తోపాటు పలువురు రాష్ట్ర నాయకులు పాల్గొంటారన్నారు.ఈనెల 25న జరిగే మహాసభకు ఉమ్మడి ఖమ్మం ఉమ్మడి వరంగల్ జిల్లాల నుండి గ్రామీణ వైద్యులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో క్రిమిన వైద్యుల సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అనంతారపు వెంకటాచారి,జిల్లా ఉపాధ్యక్షులు నారపోగు సుదర్శన్,గరిడేపల్లి వెంకటరామయ్య, ఆకారపు రఘు,సింగరేణి మండల అధ్యక్షులు మండేపూడి బీరయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.








