Mahaa Daily Exclusive

  EDలో ఉద్యోగం ఎలా సంపాదించాలి.. విద్యార్హత ఏంటి ?

ఈ మధ్యకాలంలో ఎంతో మంది రాజకీయ నాయకులను ఈడీ అరెస్ట్ చేస్తున్న విషయం తెలసిందే. ED అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అని అంటారు. ఏదైనా కుంభకోణంలో దాడులు, అరెస్టులు జరిగినప్పుడు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పేరు మాత్రమే వస్తుంది.

అయితే ఈ EDలో ఉద్యోగం ఎలా పొందాలి, అర్హత ఏమిటి, ఎంపికైన అభ్యర్థికి ప్రతి నెల ఎంత జీతం లభిస్తుందో చాలా మందికి తెలిసి ఉండదు. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ED చాలా పోస్టులను డిప్యుటేషన్ ఆధారంగా రిక్రూట్ చేస్తుంది. దీని కోసం ED ఎప్పటికప్పుడు పోస్టుల ఖాళీలను విడుదల చేస్తుంది. అలాగే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కూడా EDలోని మొత్తం పోస్టుల సంఖ్యను రిక్రూట్ చేస్తుంది.

EDలో SSC ఎలా రిక్రూట్‌మెంట్ చేస్తుంది ?

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రతి సంవత్సరం SSC CGL పరీక్షను నిర్వహిస్తుంది. ఇందుకోసం కేంద్ర విభాగాల్లో రిక్రూట్‌మెంట్‌లు జరుగుతాయి. SSC CGL పరీక్ష ద్వారా అసిస్టెంట్ ED ఆఫీసర్ పోస్టులను రిక్రూట్ చేస్తుంది.

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు ?

అసిస్టెంట్ ED ఆఫీసర్ పోస్టుల్లో ఉద్యోగం పొందాలనుకునే అభ్యర్థులు SSC CGL కోసం దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా అందించాలి. దీని కోసం SSAC నోటిఫికేషన్ జారీ చేస్తుంది. అసిస్టెంట్ ED ఆఫీసర్ పోస్టులకు అవసరమైన గరిష్ట విద్యార్హత గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. దరఖాస్తు చేసుకోవడానికి వయోపరిమితి 21 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు కూడా గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఇవ్వబడుతుంది.

ఎంపిక ఎలా జరుగుతుంది ?

అసిస్టెంట్ ED ఆఫీసర్ పోస్టులకు ఎంపిక టైర్ 1, టైర్ 2 పరీక్షల ద్వారా జరుగుతుంది. టైర్ 1 పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు టైర్ 2 పరీక్షకు హాజరవుతారు. టైర్ 2 పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు అర్హత పొందుతారు. ఎంపికైన అభ్యర్థికి ప్రతినెలా దాదాపు రూ.44900 నుంచి రూ.142400 వరకు జీతం ఇస్తారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share