Mahaa Daily Exclusive

  ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ‘చేయి’ జోరు: అభ్యర్థి భానుప్రియ గెలుపు కోసం అభిషేక్ రెడ్డి ముమ్మర ప్రచారం

Share

  • గల్లి గల్లి తిరుగుతూ ఇంటింటికి వెళ్లి ప్రచారం….
  • చేతి గుర్తుపై ఓటు వేయాలని కోరిన అభిషేక్ రెడ్డి
  • కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భానుప్రియను గెలిపించాలి
  • ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో విస్తృత ప్రచారం

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ 20వ వార్డులో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మల్ రెడ్డి అభిషేక్ రెడ్డి విస్తృత ప్రచారం చేపట్టారు. రంగారెడ్డి జిల్లా మున్సిపాలిటీలో జరుగుతున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి భానుప్రియ తరపున ప్రచారంలో పాల్గొన్న ఆయన భారీ మెజార్టీతో గెలిపించాలని, ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిసి చేతి గుర్తుపై ఓటు వేయాలని ప్రజలను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి సారధ్యంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఈ యొక్క మున్సిపాలిటీని వందల కోట్ల నిధులతో అభివృద్ధి చేయడం జరిగిందని ఆయన ప్రజలకు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఉచిత విద్యుత్ ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరిగిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుతో వార్డులో మరింత అభివృద్ధి జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు. మున్సిపాలిటీలో జరుగుతున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి భానుప్రియకు మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అభిషేక్ రెడ్డి ప్రజలను కోరారు.

గల్లి గల్లి తిరుగుతూ ఇంటింటికి వెళ్లి ప్రచారం….
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని పలు వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున, అభ్యర్థుల గెలుపు కోసం గల్లి గల్లి తిరుగుతూ, ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ చేతు గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి తమ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.