- టియుఎఫ్ జిల్లా అధ్యక్షులుగా వీరేష్ కుమార్
- ఉద్యమకారుల శ్రేయస్సు కొరకు ఉద్యమిస్తాం: వీరేష్
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులుగా బోసుపెల్లి వీరేష్ కుమార్ ఎన్నికైనారు. గురువారం టియుఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఓరుగంటి ఆనంద్ పిలుపుమేరకు, రిజిస్టర్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులుగా బోసు పెళ్లి వీరేష్ కుమార్ ను నియమించడం జరిగింది. రిజిస్టర్ టియుఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జెనిగె విష్ణువర్ధన్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కొంత యాదిరెడ్డి చేతుల మీదుగా నియామక పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా బోసు పెళ్లి వీరేష్ కుమార్ మాట్లాడుతూ… నాపై నమ్మకం ఉంచి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులుగా నియమించిన రాష్ట్ర అధ్యక్షులు ఓరుగంటి ఆనంద్ అన్న గారికి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జెనిగె విష్ణువర్ధన్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కొంత యాదిరెడ్డి గారికి మరియు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఉద్యమకారులు అదేవిధంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం సంబంధించిన ఉద్యమకారులకు ప్రత్యేకంగా తెలంగాణ ఉద్యమం వందనాలు తెలియజేస్తూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం








