తెలంగాణలోని 192 వ్యవసాయ మార్కెట్ కమిటీలలో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పద్దతిన సుమారు 1,200 మంది సెక్కూరిటీ గార్డులు గత 30 సం॥రాల నుండి (1994) మార్కెట్ యార్డులలో, చెకోపోస్టులలో, కార్యాలయాలల్లో విధులు నిర్వహిస్తున్నాము.
మార్కెట్ యార్డులలో రైతుల సరుకులను రక్షిస్తూ, వేలం పాటలు నిర్వహించడం, కార్యాలయంలో క్లరికల్ పనులు చేస్తున్నాము. మార్కెట్ చెక్పోస్టులలో వ్యవసాయ దినుసుల రవాణా వాహనాలను ఆపి తనిఖీ చేసి స్వయంగా ట్యాబ్ ద్వారా లేదా కంప్యూటర్ ద్వారా నేరుగా ఆన్లైన్ రశీదు జారీ చేసి, మార్కెట్ ఫీజు వసూలు చేసి ప్రభుత్వ ఆదాయం పెంచడంలో రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా మేము పనిచేస్తున్నాము.
IFMS పోర్టర్ : (ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (IFMS)) పోర్టర్ లో తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో పని చేస్తున్న వ్యవసాయ మార్కెట్ సెక్యూరిటీ గార్డుల బయోడేటా నమోదు చేయాలనీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ifms లో సెక్యూరిటీ గార్డ్స్ బయోడేటా పూర్తీ చేసినప్పటికీ పోర్టర్లో ఏర్పడిన సాంకేతిక లోపాలు కారణంగా గార్డ్స్ బయోడేటా నమోదు కానట్టు చూపిస్తుంది. దీంతో ఆయా మార్కెట్లలో సెక్రటరీలు బిల్లు చేయడం లేదు. బయోడేటా పూర్తి కాకపోవడంతో నాలుగు నెలల నుండి అనేక మార్కెట్లలో సెక్యూరిటీర్డులకు వేతనాలు రావడం లేదు. దీంతో సెక్యూరిటీ గార్డుల కుటుంబాలు ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఐఎఫ్ఎంఎస్ పోర్టరలో నమోదులో జరిగిన సాంకేతిక లోపాలను వెంటనే సరిచేసి, సెక్యూరిటీ గార్డులకు వేతనాలు వచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ రోజు (12.03.2026) వ్యవసాయ మార్కెటింగ్ శాఖ, సంచాలకులు గారికి తెలంగాణ వ్యవసాయ మార్కెట్ కమిటీల సెక్యూరిటీ గార్డ్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బీఆర్క్ భవన్ లో రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల సాంబయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాటల సోమన్న వినతి ప్రత్రాన్ని అందజేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని అగ్రికల్చర్ మార్కెటింగ్ & కో ఆపరేటివ్ డిపార్ట్మెంట్ ద్వారా జిఓఆర్ టి నెం:814 తేది: 7/6/2013 మినిమమ్ టైం స్కేల్ లాస్ట్ గ్రేడ్ సర్వీస్ (అటెండర్, వాచ్మెన్) వేతనం రూ.6,700/-లు చెల్లించాలని జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం వేతనాలు పొందాము. కానీ 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రభుత్వం 2016లో పిఆర్సిలో లాస్ట్ గ్రేడ్ సర్వీస్ వేతనం రూ.13,000/-లు చెల్లించాల్సి ఉండగా జి.వో.ఎం.ఎస్ నెం:14 తేది: 19-02-2016 ప్రకారం రూ.12,000/-లు మాత్రమే చెల్లిస్తున్నారు. దీంతో సెక్యూరిటీ గార్డులకు తీవ్ర అన్యాయం జరిగింది. రెండవ పిఆర్సిలో మినిమమ్ టైం స్కేల్ లాస్ట్ గ్రేడ్ సర్వీస్ మినిమం బేసిక్ రూ.19,000/- లు చెల్లించాల్సి ఉండగా 30% ລ້ ລໍ 5.12,000/- 30% 2.3,600/- 50 . 15,600/-చేసి రెండవ సారి అన్యాయం చేశారు. కావున 2వ పిఆర్సీలోని మినిమం టైం స్కేల్ లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ బేసిక్ యిస్తూ మన డిపార్ట్ మెంట్ ప్రత్యేకంగా జీ.వో ఇవ్వాలని కోరుతున్నాం.
థర్డ్ పార్టీ ఏజెన్సీ ద్వారా పని చేయడం వలన వచ్చే వేతనాలు ప్రతినెలా సక్రమంగా రావడం లేదు. ఏజెన్సీలు ఇపిఎఫ్ సరిగ్గా చెల్లించపోవడం, సంవత్సరంలో ప్రతినెలా సక్రమంగా చెల్లింపులు లేకపోవడం వలన వడ్డీ సరిగా జమ కావడం లేదు. ఇఎస్ఐ సక్రమంగా చెల్లించకపోవడం వలన అనారోగ్యానికి గురైనప్పుడు వైద్య సౌకర్యాలు అందడం లేదు. కావున ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి నేరుగా మార్కెట్ కమిటీల ద్వారా వేతనాలు చెల్లించే విధంగా ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతున్నాం.
సూచిక-2ని అనుసరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అక్కడి కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సాధారణ మరణానికి రూ.2 లక్షలు, ప్రమాద మరణానికి రూ.6 లక్షలు వారి వారసులకు ఇచ్చే విధంగా, మహిళలకు 180 రోజుల ప్రసూతి సెలవులు ఇచ్చి వేతనం చెల్లించాలని జీ.వో. ఎంఎస్ నెం: 25 జారీ చేశారు. ఆ విధమైన జీ.వో మన రాష్ట్రంలో కూడా తెచ్చి అమలు చేయాలని కోరుతున్నాము.
సూచిక-3ని అనుసరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చనిపోయిన కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు దహన ఖర్చుల నిమిత్తం రూ. 15,000/-లు చెల్లించాలని జి.వో.నెం: 119 జారీ చేసి అమలు చేస్తున్నారు. ఆ జి.ఓ.ను మన రాష్ట్రంలో సెక్యూరిటీ గార్డులకు అమలు చేయాలని కోరుతున్నాము.
సూచిక-40 అనుసరించి వ్యవసాయ మార్కెట్ కమిటీలే నేరుగా ఇపిఎఫ్, ఈఎస్ఐలు చెల్లించాలని కోరుతున్నాము.
కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పని చేస్తున్నప్పటికీ 61 సం||రాల వయస్సు తరువాత రిటైర్మెంట్ అయితే ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వకపోవడంతో రిటైర్మెంట్ అయిన తర్వాత కుటుంబ జీవనం కష్టంగా మారుతుంది.
రిటైర్మెంట్ అయిన సెక్యూరిటీ గార్డులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.5 లక్షలు ఇవ్వాలని కోరుతున్నాము.
పర్మిషన్ ఫర్ ఎన్గేజింగ్ : సెక్యూరిటీ గార్డులకు ప్రతి ఆర్థిక సంవత్సరం విధులు కొనసాగించుటకు సం॥రం మొత్తానికి అనుమంచేవారు. కానీ 2026-27 ఆర్థిక సం॥రం వార్షిక బడ్జెట్లో సం॥నికి మొత్తానికి ఒకేసారి కొనసాగింపు అనుమతి ఉత్తర్వులు ఇవ్వగలరని విజ్ఞప్తి చేస్తున్నాం.
ప్రస్తుతం వివిధ మార్కెట్ కమిటీలలో ఖాళీగా ఉన్న అటెండర్ నుండి మొదలుకొని సూపర్వైజర్ వరకు వివిధ పోస్టులలో మా సర్వీస్, విద్యార్హత ప్రకారం రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.
యాటల సోమన్న
యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
9490098486








