- ఖమ్మంలో మంగళ్య షాపింగ్ మాల్ క్రేజ్
- ఆధునిక వసతులతో.. 30వ బ్రాంచ్
- శ్రీలీల చేతులమీదుగా నేడు ప్రారంభోత్సవం
ఖమ్మం, మహా : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలో 29 బ్రాంచి లతో వస్త్ర ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మంగళ్య షాపింగ్ మాల్ ఖమ్మం నగరంలో కొత్త 30వ బ్రాంచ్‌ను శుక్రవారం ఘనంగా ప్రారంభించబోతున్నదని సంస్థ డైరెక్టర్లు కాసం మల్లికార్జున్, కాసం నమశ్శివాయ, కాసం కేదారినాథ్, కాసం శివప్రసాద్ , పుల్లూరు అరుణ్ కుమార్ లు తెలిపారు. ప్రముఖ సినీ నటి అందాల తార శ్రీలీల చే శుక్రవారం జరగనున్న ఘన ప్రారంభోత్సవ కార్యక్రమానికి నగర ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని, కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి లేటెస్ట్ ఫ్యాషన్ కలెక్షన్లను వీక్షించాలని నిర్వాహకులు ఆహ్వానించారు.
ట్రెండ్స్ కు అనుగుణంగా..
ఆధునిక ఫ్యాషన్ ట్రెండ్స్‌కు అనుగుణంగా, ఖమ్మం నగర ప్రజలకు ఇప్పటివరకు చూడని లేటెస్ట్ డిజైన్లు, విభిన్న మోడల్స్‌తో మాంగళ్య షాపింగ్ మాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండుగలు వంటి ప్రత్యేక సందర్భాలకు అవసరమైన అన్ని రకాల వస్త్రాలను ఒకే చోట అందించేలా ఈ మాల్‌ను ఏర్పాటు చేశారు. పెళ్లికూతురు, పెళ్లికొడుకు కోసం ప్రత్యేకంగా రూపొందించిన వెడ్డింగ్ కలెక్షన్లు, మహిళలు, పురుషులు, యువత, పిల్లల కోసం వేలాది రకాల ఆధునిక ఫ్యాషన్ దుస్తులు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. నాణ్యమైన వస్త్రాలను సరసమైన ధరలకు అందించడం మంగళ్య షాపింగ్ మాల్ ప్రత్యేకతగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు.
ఖమ్మం చరిత్రలోనే అత్యాధునికంగా
ఖమ్మం నగర చరిత్రలోనే అత్యాధునిక వసతులతో, విస్తృత స్థాయిలో ఏర్పాటైన ఈ షాపింగ్ మాల్ ప్రజలకు కొత్త షాపింగ్ అనుభూతిని అందించనుందని నిర్వాహకులు తెలిపారు. ప్రారంభోత్సవానికి ముందే నగరమంతా ఆకట్టుకునే విధంగా హోర్డింగ్స్, బ్యానర్లు, సోషల్ మీడియా ప్రచారంతో మంగళ్య షాపింగ్ మాల్ విస్తృతంగా ప్రచారం నిర్వహించింది. దీంతో ఖమ్మం ప్రజల్లో ఈ మాల్ ప్రారంభంపై ఆసక్తి పెరిగింది.








