Mahaa Daily Exclusive

  పైలట్ రోహిత్ రెడ్డి ఫాంహౌస్‌లో డ్రగ్స్ పార్టీ కలకలం: ఈగల్ టీమ్ దాడులు.. కాల్పుల మోత.. ఎంపీ పుట్టా మహేష్, రోహిత్ రెడ్డి అరెస్ట్!

Share

  • పైలట్ రోహిత్ రెడ్డి ఫాంహౌస్‌లో
    డ్రగ్స్ పార్టీ.. ఈగల్ టీమ్ పై కాల్పులు
  • డ్రగ్స్ పార్టీ చేసుకుంటూ కాల్పులు
  • అర్ధరాత్రి ఉద్రిక్తత..
  • పోలీసుల అదుపులో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్, పైలట్ రోహిత్ రెడ్డి

హైదరాబాద్, మహా

: మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫాంహౌస్‌ ను అర్ధరాత్రి పోలీసులు చుట్టుముట్టారు రంగారెడ్డి జిల్లా మెయినాబాద్‌లో ఈగల్ టీమ్ చేసిన దాడుల్లో 2 గ్రాముల కొకైన్ లభ్యమైంది. డ్రగ్స్ పార్టీ జరుగుతుందన్న సమాచారంతో రైడ్ చేయగా, యువకులు కాల్పులు ఓపెన్ చేసినట్లు తెలిసింది. ఈ డ్రగ్స్ పార్టీలో ఏపీకి చెందిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ తో పాటు పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి తదితరులు ఉన్నట్లు సమాచారం. ఎనిమిది మంది వీఐపీలు ఇందులో ఉన్నట్లు సమాచారం. తనిఖీల సమయంలో గన్ ఫైరింగ్ జరిగింది. గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో రోహిత్ రెడ్డి ఫాంహౌస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. గతంలోనూ రోహిత్ రెడ్డి ఫాంహౌజ్ వార్తల్లో సెన్షేషన్ గా ఉంది. ఇపుడు మరోసారి హాట్ టాపిక్ గా ఉంది. డ్రగ్స్ తీసుకున్న ఎనిమిది మందిని అరెస్టు చేయడంతో పాటు రివాల్వర్‌, కొకైన్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ టెస్ట్ లో రోహిత్ రెడ్డికి పాజిటివ్ రాగా, ఎంపీ మహేష్ కు నెగిటివ్ వచ్చినట్లు తెలిసింది.
…….