- వాటీజ్ దిస్.. ట్రంప్
- అమెరికాకు తడిచి మోపడవుతున్న ఖర్చులు
- యుద్దానికి ఇప్పటికే 3.1లక్షల కోట్లు ఖర్చు
మహా
ఇరాన్ తో యుద్ధం అమెరికాను తీవ్ర నష్టాల్లోకి నెట్టింది.యుద్ధం మొదలైన తొలి 24 గంటల్లోనే అమెరికా సుమారు₹7,000 కోట్లు ఖర్చు చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి.కేవలం దాడులకే కాకుండా, యుద్ధ నౌకల నిర్వహణకు అమెరికా భారీ మొత్తం చెల్లించాల్సి వస్తోంది. యూఎస్‌ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ వంటి ఒక్కో యుద్ధ విమాన వాహక నౌక నిర్వహణకే రోజుకు ₹59 కోట్లు ఖర్చవుతోంది. యుద్ధానికి ముందే బలగాల మోహరింపు కోసం మరో ₹5,700 కోట్లకు పైగా వెచ్చించినట్లు రక్షణ నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల అమెరికాకు ఆర్థిక భారంతో పాటు సాంకేతిక నష్టం కూడా అమెరికాను కలవరపెడుతోంది. కువైట్‌లో అమెరికాకు చెందిన మూడు యుద్ధ విమానాలు కూలిపోవడం పెద్ద దెబ్బగా మారింది.ఉక్రెయిన్, ఇండో-పసిఫిక్ ప్రాంతాల్లో ఇప్పటికే క్షిపణి నిరోధక వ్యవస్థలను మోహరించిన నేపథ్యంలో, ఇరాన్ యుద్ధంలో ఆయుధాలను కోల్పోవడం అమెరికా రక్షణ సామర్థ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తోంది. సౌదీలో మరో ఐదువిమానాలను కూల్చారు. 2023 అక్టోబరులో హమాస్ దాడి తర్వాత నుంచి ఇప్పటివరకు పశ్చిమాసియాలో అమెరికా చేసిన మొత్తం ఖర్చు దాదాపు ₹3.1 లక్షల కోట్లు చేరినట్లు బ్రౌన్ యూనివర్సిటీ అధ్యయనం వెల్లడించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధం మరో 4-5 వారాలు కొనసాగవచ్చని ప్రకటించిన నేపథ్యంలో, ఈ ఆర్థిక భారం అమాంతం పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదంతా జరిగితే అమెరికా పూర్తిస్థాయిలో నష్టాలను మూట గట్టుకోక తప్పదు. మరోవైపు వరుసయుద్దాలు, ప్రపంచదేశాలతో కయ్యాలతో అమెరికా ఆర్ధికరంగాన్ని అతలాకుతలం చేస్తున్న ట్రంప్ తీరుపై అమెరికన్లు భగభగలాడుతున్నారు.








