Mahaa Daily Exclusive

  కేటీఆర్ కూడా డ్రగ్స్‌ టెస్ట్‌కు రెడీ అవ్వాలి: పీసీసీ చీఫ్ షాకింగ్ కామెంట్స్

Share

 

హైదరాబాద్, మహా : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌజ్‌లో జరిగిన కొకైన్ పార్టీపై తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఈగల్ బృందం కర్తవ్యాన్ని నెరవేరుస్తోంది. రాజకీయాలకు అతీతంగా పనిచేస్తోంది. మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై కేటీఆర్ బృందం సమాధానం చెప్పాలి. ప్రజలు, డ్రగ్స్ రహిత సమాజం కోసం ఈగల్ టీమ్ దాడులు చేస్తోంది. కేటీఆర్, ఆయన అనుచరులు డ్రగ్స్ తీసుకుంటున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అవసరమైతే కేటీఆర్ డ్రగ్స్ పరీక్షలకు సిద్ధం కావాలి. అసెంబ్లీ సమయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరం డ్రగ్స్ టెస్టులు చేసుకుని లోనికి వెళ్దాం. డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారు. ఆ ప్రయత్నానికి మనవంతు సాయం చేయాలి కానీ.. పోరాటాన్నే నిర్వీర్యం చేసే పనిచేయొద్దు’ అని మహేశ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.