తెలుగింట్లో సుమ.. శాశ్వత సభ్యురాలు
నాలుగు దశాబ్దాలుగా అలరిస్తున్న అద్భుత యాంకర్.. బర్త్ డే స్పెషల్
….
సుమ కనకాల పరిచయం అవసరం లేని పేరు.
ఈ నాలుగు అక్షరాల పేరు గల సుమలో 40 టాలెంట్స్ లు, 400 వేరియేషన్స్ లు ఉన్నాయి. ఈమెని చూస్తే మన ఇంట్లో రోజూ కనిపించే మనిషి లానే ఉంటుంది. ఆఫ్ కోర్స్ కనిపిస్తుంది అనుకోండి… టీవీ పెడితే ఈమెనే కనిపిస్తుంది. యాంకరింగ్ అంటే సుమ, సుమ అంటే యాంకరింగ్ అనేలా మనం ఫిక్స్ అయిపోయాం. ప్రజాదరణ పొందిన తెలుగు టెలివిజన్ వ్యాఖ్యాతల్లో (యాంకర్లలో) ఒకరు అయిన సుమ గారికి జన్మదినం సందర్భంగా హార్దిక శుభాకాంక్షలు !
కేరళలో పుట్టి.. తెలుగింటి ఆడపడుచుగా ఆదరణ సొంతం చేసుకున్న క్వీన్ ఆఫ్ యాంకర్స్ సుమ !
చక్కటి వ్యాఖ్యానం, చిరునవ్వు, సమయస్ఫూర్తి కలగలసిన సుమ ఈ రంగంలో ఎవరూ అందుకొలేని స్టేజ్ కు చేరుకుంది.
…..
సుమ ముప్పయి యేళ్ళ కెరీర్‌లో ఆమెతో పాటు వచ్చిన వారందరూ దాదాపు కనుమరుగైపోయారు. కానీ ఇప్పటికీ సుమ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.. బుల్లి తెరపై నెంబర్ 1 యాంకర్‌గా హవా కొనసాగిస్తూనే ఉంది. సుమ మంచి వ్యాఖ్యాత మాత్రమే కాదు.. మంచి డ్యాన్సర్, నటి, సింగర్ విషయం అన్న సంగతి తెలిసిందే. సుమ ఇటీవల గాయనిగా కూడా మారింది. మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నటించిన ఓ సినిమా లో అనసూయ స్పెషల్ సాంగ్ కి డ్యాన్స్ చేయగా సుమ ఆ పాటను పాడింది. తమన్ ఆమెతో పాడించాడు.
…..
సుమ కనకాల 22 మార్చి 1975న జన్మించారు
కేరళకు చెందిన సుమ మాతృ భాష తెలుగు కానప్పటికీ, తెలుగులో అనర్గళంగా మాట్లాడగలదు.
…..
యాంకర్ సుమ 1996లో దాసరి నారాయణ రావు దర్శక, నిర్మాణంలో అంతా కొత్త వాళ్లతో తెరకెక్కిన ‘కళ్యాణ ప్రాప్తిరస్తు సినిమాలో ఈమె హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో డైరెక్టర్ వక్కంతం వంశీ హీరోగా నటించడం విశేషం. హీరోగా అతనికి ఇదే ఫస్ట్ మూవీ. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు..
ఆమె తెలుగు భాషను ఎంతో చక్కగా మాట్లాడడమే కాదు, బుల్లి తెర యాంకరింగ్ చేస్తూ టాప్ యాంకర్ గా గత కొన్నేళ్లుగా కెరీర్ లో దూసుకుపోయింది. ఆమె ETV యొక్క స్టార్ మహిళ – ఒక తెలుగు TV గేమ్ షోను హోస్ట్ చేయడం ద్వారా బాగా ప్రసిద్ది చెందారు. ఇది భారతదేశంలోనే అత్యంత సుదీర్ఘమైన TV గేమ్ షో 12 సంవత్సరాలు నడిచింది.
…..
‘సుమ కనకాల’ని చిన్న తెరకు తిరుగులేని రాణిగా మార్చిన అనేక టీవీ షోలు. పైకి చాలా హ్యాపీగా కనిపించే సుమ ఈ స్టేజ్ కి రావడానికి ఎంత కష్టపడ్డారో మాక్స్ పీపుల్ కి తెలుసు. మరి అలాంటి టైమ్ లో కొన్ని షోలు సుమ గారిని రేసులో గెలిపించి టాప్ ప్లేస్ కి టీసుకెల్లి యాంకరింగ్ ఐకాన్ ని చేసాయి.
…..
సుమ తండ్రి గారు ఉద్యోగ బదిలీల కారణంగా చాలా కాలం పాటు సికింద్రాబాద్‌లోని లాలాగూడ & మెట్టుగూడ రైల్వేల క్వార్టర్స్ సమీపంలో నివసించారు. తార్నాక కాలనీ సమీపంలోని సెయింట్ ఆన్స్ ఉన్నత పాఠశాలలో చదివి లాలాగూడలోని రైల్వే డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు.
…..
ప్రసిద్ధ నాటక ప్రయోక్త, ఉపన్యాసకుడు మరియు దర్శకుడు దేవదాస్ కనకాల దర్శకత్వం వహించిన మేఘమాల సీరియల్ లో చేస్తుండగా రాజీవ్ కనకాలతో పరిచయం అయింది. సుమ గారి తల్లిదండ్రులు చాలాకాలం నుండి హైదరాబాదులో ఉండటంతో సహజంగా తెలుగు భాషమీద పట్టు సాధించింది.చదువులో ఆమె తెలుగు సబ్జెక్టును ఎంచుకోవడంలో, తన తల్లి పాత్ర ఎక్కువగా ఉందని అంటుంది. ఆమె తన తోటి నటుడు రాజీవ్ కనకాలను ప్రేమించింది. 1999, ఫిబ్రవరి 10న వీరిద్దరి వివాహం జరిగింది. వీరికి రోషన్ కార్తీక్ కనకాల, స్నేహనస్విని కనకాల అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె మాతృభాష మలయాళంతో పాటు తెలుగు , హిందీ , తమిళం , మరియు ఆంగ్ల భాషలలో నిష్ణాతులు.
…..
ఆమె 1995 నుండి వివిధ సీరియల్ మరియు టెలిఫిల్మ్‌లలో నటించింది, శాటిలైట్ ఛానెల్‌ల విజృంభణతో ఆమె పురోగతి ఆగకుండా సాగుతుంది. స్వయంవరం , అన్వేషిత , గీతాంజలి , మరియు రావోయి చందమామ ఆమె నటించిన ప్రధాన సీరియల్స్.
…..
ఈటీవీలో కనకాల ఫ్లాగ్‌షిప్ షో స్టార్ మహిళ ,
ఇది చాలా మంది మహిళా ప్రేక్షకులను ఆకర్షించింది. ఈ షో ద్వారా ఆమె భారతదేశంలో అత్యధిక కాలం నడుస్తున్న మహిళా గేమ్ షోలలో ఒకటిగా రికార్డు సృష్టించింది. కనకాల 26 డిసెంబర్ 2012న కె. సుమ రాజీవ్ క్రియేషన్స్ పేరుతో తన సొంత ప్రొడక్షన్ హౌస్‌ను ప్రారంభించింది మరియు జీ తెలుగులో ప్రసారమైన లక్కు కిక్కు అనే కార్యక్రమాన్ని నిర్మించింది . ఆమె ఈటీవీ లో జీన్స్ అనే షోలో కూడా పనిచేసింది . సుమ రాజీవ్ క్రియేషన్స్ నిర్మించిన సహనటుడు మనోతో కలిసి మాటీవీ లో ఆమె కెవ్వు కేక. 2017లో తెలుగు సినిమా విన్నర్ నుండి “సూయ సూయ” పాటను కూడా పాడారు . ఆమె తన ప్రదర్శనల సమయంలో ఆకస్మిక మరియు హాస్యపూరిత వ్యాఖ్యలకు ప్రసిద్ధి చెందింది.
…..
సుమ పలు టీవీ షోలు, సినిమా ఈవెంట్స్ తో స్టార్ హీరోయిన్ల రేంజ్ లో బిజీగా ఉంటున్నారు. ముఖ్యంగా సినిమా ఈ వెంట్స్ అంటే కచ్చితంగా సుమ ఉండాల్సిందే. అలానే ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ కి యాంకర్ సుమ బాగానే రెమ్యూనరేషన్ తీసుకుంటారు.
• నటించిన సినిమాలు…
1) 1996 కల్యాణ ప్రాప్తిరస్తు
2) 1997 న్యూస్ పేపర్ బాయ్
3) ఇష్టదానం ( మలయాళం)
4) 1998 ఒరో విలియుం కథోర్తు
5) పవిత్ర ప్రేమ
6) 2000 చాల బాగుంది
7) 2001 కలిసి నడుద్దాం
8) 2002 రాఘవ
9) జోరుగా హుషారుగా
10) 2004 వర్షం
11) స్వరాభిషేకం న్యూస్ రిపోర్టర్
12) 2005 ప్రేమికులు
13) 2007 ఢీ
14) 2013 బాద్షా
15) 2019 ఓ! బేబీ
16) 2022 జయమ్మ పంచాయతీ
• పొందిన పురస్కారాలు…
1) 2009లో ఈటీవీ, కోకొకోలా సంస్థలు తెలుగు ఎలక్ట్రానిక్ మాధ్యమంలో ఉత్తమ టివి యాంకర్ల కోసం నిర్వహించిన “లిమ్కా ఫ్రెష్ ఫేస్ ఆఫ్ హంట్” కార్యక్రమంలో మహిళల విభాగంలో విజేతగా నిలిచారు.
2) 2010 సంవత్సరానికి గాను ఉత్తమ టివి వ్యాఖ్యాత (పంచావతారం) నంది పురస్కారాన్ని అందుకున్నారు.
3) 2010 సంవత్సరానికి గాను ఉత్తమ టివి వ్యాఖ్యాత (స్టార్ మహిళ) లోకల్ టీవి మీడియా పురస్కారాన్ని అందుకున్నారు.
4) 2010 సంవత్సరానికి గాను ఉత్తమ టివి వ్యాఖ్యాత (స్టార్ మహిళ) సినీగోయర్ పురస్కారాన్ని అందుకున్నారు.








