మహా: సదాశివపేట :
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని రాష్ట్ర బిజెపి పార్టీ సోమవారం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది.అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టడానికి సిద్ధమవుతున్న సదాశిపేట బిజెపి మండల పట్టణ నాయకులను , కార్యకర్తలను పోలీసులు ఉదయమే వారి ఇంటికి వెళ్లి అరెస్టు చేసి సదాశివపేట పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ప్రభుత్వం ఏర్పడి ఇన్ని నెలలు గడుస్తున్నా హామీలను నెరవేర్చకపోవడంపై బీజేపీ నాయకులు మండల పట్టణ అధ్యక్షులు కర్ణం ఆదిత్య, శ్రీనివాస్ మండిపడుతున్నారు. తమ నిరసనను అడ్డుకోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అరెస్టులు చేసినప్పటికీ, అసెంబ్లీ ముట్టడికి వెనకడుగు వేయబోమని కార్యకర్తలు స్పష్టం చేస్తున్నారు.రాష్ట్ర నాయకులు మాణిక్ రావ్ ,నెమలికొండ వేణుమాధవ్, శ్రీశైలం యాదవ్, కోవూరు సంగమేశ్వర్,లింగం పలువురు నాయకులు కార్యకర్తలను అరెస్టు చేశారు.







