Mahaa Daily Exclusive

  UPI పేమెంట్స్ సక్సెస్ వెనుక సూపర్ ఉమెన్.. ఇండియా చెల్లింపుల వ్యవస్థలో కీ రోల్

Share

పేమెంట్ వ్యవస్థలో UPI విధానం ఓ గేమ్‌ ఛేంజర్ అని చెప్పవచ్చు. నడిరోడ్డుపై కూడా సెకన్ల వ్యవధిలో భారతీయులు నగదు బదిలీ జరపడాన్ని కనీసం ఎవరూ ఊహించి ఉండరు.

కానీ దీన్ని సుసాధ్యం చేయడంలో ఓ మహిళ ప్రముఖ పాత్ర పోషించారని చాలా మందికి తెలియదు.

దేశంలో డిజిటల్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీణా రాయ్ కీలకంగా వ్యవహరించారు. ఆమె వ్యూహాత్మక సూచనల నుంచి సంస్థ ఎంతో ప్రయోజనం పొందినట్లు సాక్షాత్తూ NPCI CEO దిలీప్ అస్బే కూడా అంగీకరించారు. పేమెంట్స్ ఇండస్ట్రీలో గ్యాప్స్ మరియు ఇబ్బందులను గుర్తించడంలో రాయ్‌కు మంచి నైపుణ్యం ఉన్నట్లు తెలిపారు.

 

సంవత్సరాలుగా బ్రాండ్‌లను నిర్మించడంలో, సినర్జీలను అభివృద్ధి చేయడంలో మరియు ప్రభావవంతమైన చెల్లింపుల పరిష్కారాలలో రాయ్ తనదైన ముద్ర వేశారు. NPCIలో బ్యాంకులు, ఫిన్‌టెక్ కంపెనీలు, పాలసీ మేకర్స్ మరియు రెగ్యులేటర్‌ల వంటి పరిశ్రమ వాటాదారులతో సహకారాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషించారు.

ప్రస్తుతం NPCI ఉత్పత్తుల వృద్ధిని ప్రోత్సహించడం, UPI మరియు రూపే వంటి ఫ్లాగ్‌షిప్ ఉత్పత్తుల కోసం కొత్త యూజ్ కేసులను పరిచయం చేయడం వంటి బాధ్యతలను ఆమె నిర్వర్తిస్తున్నారు. ఆమె మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న ప్రముఖ బ్యాంకర్ కూడా. IIM-అహ్మదాబాద్ నుంచి MBA పూర్తిచేసిన అనంతరం బ్యాంకింగ్ వర్టికల్స్, టెక్నాలజీ మరియు మార్కెటింగ్‌లో నైపుణ్యాన్ని పెంచుకున్నారు.