పినపాక నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం “గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గౌరవ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు గారు” ఈరోజు వినతిపత్రం సమర్పించారు.
🔹*నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో నెలకొన్న పలు ప్రాధాన్య సమస్యలను వివరించి, వాటి పరిష్కారం కోసం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.*
🚧 *ప్రధాన సమస్యలు & అభ్యర్థనలు*
🔹 *తాగునీటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయి*
🔹 *కాలువల వ్యవస్థ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు*
🔹 *సిమెంట్ రహదారులు, వీధి దీపాల కొరత*
🔹 *పాత రహదారుల మరమ్మతులు & కొత్త రహదారుల నిర్మాణం అవసరం*
🌾 *వ్యవసాయం & భూముల సమస్యలు, పోడు భూముల సమస్యలను పరిష్కరించి, అర్హులైన రైతులకు భూములపై హక్కులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.*
🏥 *ఆరోగ్య రంగం*
✔ *ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతుల మెరుగుదల*
✔ *వైద్య సిబ్బంది & పరికరాల కొరత నివారణ*
🎓 *విద్యా రంగం*
✔ *ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి*
✔ *అదనపు తరగతి గదుల నిర్మాణం*
✔ *అవసరమైన సదుపాయాల కల్పన*
✔ *అంగన్వాడీ కేంద్రాలకు పక్కా భవనాలు*
🏙️ *మణుగూరు అభివృద్ధి మణుగూరు మండలంలోని మణుగూరు మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే గారు కోరారు.*
🤝 *ఈ వినతిపత్రంపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పినపాక నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.*






