భారత పార్లమెంట్ లోక్ సభ వ్యాలిడేషన్ యాక్ట్ కు వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన…
విశ్రాంతి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో తాసిల్దార్ కు వినతి…
మహా :సదాశివపేట
ప్రభుత్వ పెన్షనర్ దారులకు మార్చ్ 25.3.2025 దుర్దినమని సదాశివపేట విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నిమ్మాయిల మల్లేశంఆధ్వర్యంలో బుధవారం నల్ల బ్యాడ్జీలతో నిరసన ర్యాలీగా స్థానిక తహసిల్దార్ కార్యాలయం వరకు వెళ్లి డిప్యూటీ తాసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత దేశంలోని పింఛన్ దారులకు
25 మార్చ్2025 దుర్దినమని ఈ వ్యాలిడేషన్ కు వ్యతిరేకంగా మన రాష్ట్ర సంఘం పిలుపుమేరకు నల్లబ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. భారత పార్లమెంట్ లోక సభలో వ్యాలిడేషన్ యాక్ట్ ను ఆమోదించిన ఆ చట్ట ప్రకారం01.01.2026 కంటే పదవి విరమణ వారిని01.01.2026 తరువాత రిటైర్డ్ అయిన వారికి వేరువేరుగా విభజించి రాబోయేవేతన సవరణ సంఘం సిఫారసుల వలననష్టం జరుగుతుందని. పెన్షనర్లను వీడే దియోద్దని ఉద్దేశంతోనే రాష్ట్ర సంఘం పిలుపుమేరకు అధికారులకు వినతి పత్రం అంద చేయడం జరిగింది. ఇట్టి వినతిని తాసిల్దార్ ద్వారా దేశ ప్రధాని చేరవేయడం కొరకు ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యదర్శి తుక్కుడే దాస్. కోశాధికారి చీల విశ్వనాథం. జిల్లా సంయుక్త కార్యదర్శి టి శ్రీనివాస్ యాదవ్. అసోసియేట్ అధ్యక్షులు బుచ్చప్ప. ఉపాధ్యక్షులు సత్యనారాయణ చిష్టి. నిర్మల. సంయుక్త కార్యదర్శి భీమ్రావు. కార్యనిర్వాక కార్యదర్శి మల్లేశం. ప్రచార కార్యదర్శి వారాధి కాశీనాథ్. జిల్లా కౌన్సిల్ సభ్యులు. చిగుర్తి అంబయ్య. అంబటి విశ్వనాథం. పట్లూరి వీరప్ప. ముఖ్య సలహాదారుడు బోడపల్లి శంకరప్ప. చింత జనార్ధన్. పెంటయ్య తదితర పింఛన్లు పాల్గొన్నారు.







