Mahaa Daily Exclusive

  New Toll System: టోల్‌ ట్యాక్స్ కలెక్షన్‌కు కొత్త సిస్టమ్.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటన

Share

దేశవ్యాప్తంగా రహదారుల అభివృద్ధితో పాటు కొత్త రోడ్ల నిర్మాణం జరుగుతూనే ఉంటుంది. ఇందుకు అయిన ఖర్చులను తిరిగి రాబట్టేందుకు ఆయా వాహనాల నుంచి టోల్ ట్యాక్స్ వసూలు చేస్తుంటారు.

ఈ లావాదేవీల కోసం గతంలో నగదు వినియోగించేవారు. మారుతున్న కాలంతో పాటు తర్వాత వివిధ ఆప్షన్స్ అందుబాటులోకి వచ్చాయి.

ప్రస్తుతం ఫాస్ట్‌ ట్యాగ్ ద్వారా టోల్ కలెక్షన్ జరుగుతోంది. అయితే ఈ విషయంలో త్వరలోనే మార్పులు జరగనున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ హింట్ ఇచ్చారు. శాటిలైట్ ఆధారిత టోల్ సిస్టమ్‌ను అమలులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. దీని ద్వారా సమయంతో పాటు డబ్బు ఆదా అవుతుందన్నారు.

 

కొత్త విధానంలో వాహనం కవర్ చేసిన దూరాన్ని బట్టి టోల్ మొత్తం వసూలు చేయబడుతుందని కేంద్ర మంత్రి వెల్లడించారు. డబ్బు నేరుగా వినియోగదారుని బ్యాంక్ ఖాతా నుంచి డెబిట్ కానుందని స్పష్టం చేశారు. ఈ వ్యవస్థ టోల్ ట్యాక్స్ తగ్గించి సాఫీగా ప్రయాణం సాగేందుకు తోడ్పడుతుందని భావిస్తున్నట్లు చెప్పారు.

త్వరలోనే ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే ఎప్పుడు దీన్ని అమల్లోకి తీసుకువస్తారనే విషయంపై మాత్రం మంత్రి స్పష్టత ఇవ్వలేదు. ఈ నిర్ణయంపై అప్‌డేట్ కోసం వినియోగదారులు మరికొన్ని రోజులు ఎదురుచూడాల్సి ఉంది.