Mahaa Daily Exclusive

  హైడ్రా మరో కీలక అడుగు.. బెంగళూరు కేంద్రంగా..

Share

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించి హైదరాబాద్ కేంద్రంగా చెరువుల బఫర్ జోన్స్, ఎఫ్ టి ఎల్ పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించడంలో, చెరువులను కబ్జాల నుండి కాపాడటంలో వెనక్కి తగ్గేదే లేదని తేల్చి చెప్పి ముందుకు సాగుతున్న హైడ్రా తాజాగా మరో కీలక అడుగు వేసింది.

 

బెంగళూరుకు హైడ్రా

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే చెరువులు నిర్మించిన పలు కట్టడాలను హైడ్రా కూల్చివేసిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో హైదరాబాద్ నగరంలోని ఐదు చెరువులను పునరుద్ధరించాలని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల హైడ్రాను ఆదేశించింది. చెరువుల పునరుద్ధరణ విపత్తుల నిర్వహణ పైన అధ్యయనం చేయడానికి హైడ్రా అధికారులు నేడు బెంగళూరుకు వెళ్లారు.

 

బెంగళూరులో రెండు రోజుల పాటు పర్యటన

హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇతర అధికారులతో కలిసి బెంగళూరులో రెండు రోజుల పాటు పర్యటన చేయనున్నారు. ఈ పర్యటనలో అధికారులు కర్ణాటక స్టేట్ నేచురల్ డిజాస్టర్ మానిటరింగ్ సెంటర్ ను సందర్శించనున్నారు. అక్కడ సీనియర్ శాస్త్రవేత్తలతో రంగనాథ్ టీం సమావేశమై అనేక విషయాల పైన చర్చిస్తారు.

 

కర్ణాటక ట్యాంక్ కన్జర్వేషన్ అథారిటీ చట్టం గురించి తెలుసుకోనున్న రంగనాథ్

ఆపై సెన్సార్స్ సహాయంతో పర్యవేక్షిస్తున్న మురుగునీటి వ్యవస్థను పరిశీలిస్తారు. బెంగళూరు సిటీ లో ఉన్న చెరువులను సందర్శించి వాటి పునరుద్ధరణ పైన పరిశీలన చేస్తారు .ఇక రెండవ రోజు పర్యటనలో భాగంగా లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆనంద్ మల్లీ గవాడ్ తో సమావేశమై, ఈ సమావేశంలో కర్ణాటక ట్యాంక్ కన్జర్వేషన్ అథారిటీ చట్టం 2014 పై చర్చ జరుపుతారు.

 

హైదరాబాద్ లో ఆ చెరువుల పునరుద్ధరణకు కీలక అడుగు

ఆపై ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని మార్గం దొనహళ్లి చెరువును, ఇన్ఫోసిస్ సంస్థ అభివృద్ధి చేసిన చెరువులను సందర్శిస్తారు. రెండు రోజుల పాటు పర్యటనలో బెంగళూరులో చెరువులను అభివృద్ధి చేయడానికి వారు అనుసరించిన ఉత్తమ విధానాలు అధ్యయనం చేస్తారు. అనంతరం హైదరాబాద్లో కూడా చెరువుల పునరుద్ధరణ కోసం ప్రణాళికలు రచిస్తారు. ఇక హైదరాబాద్ లో చెరువుల పైన ఫోకస్ చేస్తున్న హైడ్రా బెంగళూరు సందర్శనతో తాజాగా మరో కీలక అడుగు వేయడానికి రెడీ అయింది.