Mahaa Daily Exclusive

  సరికొత్త లుక్ లో అనుష్క..! ఉత్కంఠను పెంచుతున్న గ్లింప్స్..!

Share

అందాల అనుష్క కెరియర్ ను పరిశీలిస్తే, 2018 నుంచి ఆమె సినిమాల సంఖ్యను తగ్గించడం కనిపిస్తుంది. అప్పటి నుంచి ఏడాదికి ఒక సినిమా చేస్తూ వచ్చిన ఆమె, ఆ తరువాత సినిమాకి .. సినిమాకి మధ్య ఎక్కువ గ్యాప్ ఇవ్వడం అభిమానులను నిరాశ పరుస్తోంది. అయితే సినిమాలు తగ్గించినా ఆమె పట్ల ప్రేక్షకులకుగల అభిమానం ఎంతమాత్రం తగ్గకపోవడం విశేషం.

 

ఈ నేపథ్యంలోనే ఆమె తాజా చిత్రమైన ‘ఘాటి’ నుంచి గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఈ రోజున అనుష్క పుట్టినరోజు కావడంతో, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి గ్లింప్స్ ను వదిలారు. ఈ కథ అడవికి సమీపంలోని ఒక గిరిజన ప్రాంతంలో నడుస్తోందనే విషయం, ఈ గ్లింప్స్ వలన అర్థమవుతోంది. అనుష్క గిరిజన ప్రాంతానికి చెందిన మహిళగా కనిపిస్తూ మరింత కుతూహలాన్ని పెంచింది.

 

ఒక బస్సులోకి ఆవేశంగా ఎక్కిన ఆమె, ఒక వ్యక్తి మెడను పరపరా కోసేసి, తల తీసుకుని దిగిరావడం ఈ గ్లింప్స్ లో చూపించారు. ఆ మహిళకి ఏదో తీరని అన్యాయం జరిగిందనే విషయం ఆమె ఎక్స్ ప్రెషన్ వలన తెలుస్తోంది. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి, విద్యాసాగర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఫస్టు ఫ్రేమ్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాను తెలుగుతో పాటు… తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలలోనూ విడుదల చేయనున్నారు.