– విజిబుల్ పోలీసింగ్ ద్వారా నేరాల నియంత్రణను మరింత బలోపేతం చేయాలి.
– పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలి.
– స్టేషన్ రికార్డులను క్రమం తప్పకుండా నవీకరించాలి.
ఇబ్రహీంపట్నం జూన్ 29 మహా:
ప్రజల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ పోలీసు శాఖపై విశ్వాసాన్ని మరింత పెంపొందించేలా విధులు నిర్వర్తించాలని కమిషనర్ తరుణ్ జోషి అన్నారు. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి ఐపీఎస్, సోమవారం రంగారెడ్డి జిల్లా, యాచారం పోలీస్ స్టేషన్ను సందర్శించి సమగ్రంగా తనిఖీ నిర్వహించారు.
ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లోని రికార్డులు, పరిపాలనా నిర్వహణ, సిబ్బంది పనితీరు, స్టేషన్ పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
ముఖ్యంగా CCTNS (Crime and Criminal Tracking Network & Systems) వినియోగాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలని, e-సాక్షి (e-Sakshi) అప్లికేషన్ను ప్రతి కేసు దర్యాప్తులో తప్పనిసరిగా వినియోగించి దర్యాప్తు నాణ్యతను మెరుగుపరచాలని ఆదేశించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. మానవ సమాజం పట్ల పర్యావరణ పరిరక్షణ ఎంతో ముఖ్యమని అన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ పోలీసు శాఖపై విశ్వాసాన్ని మరింత పెంపొందించేలా విధులు నిర్వర్తించాలని, సాంకేతికత ఆధారిత పోలీసింగ్, క్రమశిక్షణ, సమర్థవంతమైన దర్యాప్తు, ప్రజలకు నాణ్యమైన సేవలందించడమే ఫ్యూచర్ సిటీ పోలీసుల ప్రధాన లక్ష్యమని, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన పోలీసు సేవలు అందించాలని కమిషనర్ డా.తరుణ్ జోషి స్పష్టం చేశారు.
ఈ తనిఖీలో మహేశ్వరం డీసీపీ కె. నారాయణ రెడ్డి, ఐపీఎస్, ఇబ్రహీంపట్నం ఏసీపీ కె.వి.పీ. రాజు, యాచారం ఎస్ హెచ్ ఓ నందీశ్వర్ రెడ్డి, పోలీస్ స్టేషన్ సిబ్బంది కూడా తనిఖీలో పాల్గొన్నారు.








