Mahaa Daily Exclusive

  రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో దీపోత్సవం.. కోటి దీపోత్సవం లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు..

Share

  • ఆనాటి త్రిలింగ క్షేత్రమే నేటి తెలంగాణ రాష్ట్రం

హైద‌రాబాద్, మహా

కోటి దీపోత్సవం స్పూర్తిగా రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో దీపోత్సవం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కోటి దీపోత్సవం నిర్వహించి దాని గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన ఎన్టీవీ యాజమాన్యాన్ని అభినందించారు. సతీమణి గీతారెడ్డి తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆనాటి త్రిలింగ క్షేత్రమే ఈనాటి తెలంగాణ రాష్ట్రమన్నారు. ఇది శైవ క్షేత్రం. వేయి స్తంభాల గుడి, రాజన్న దేవాలయం, అలంపూర్ క్షేత్రం, మల్లికార్జున దేవాలయం ఈ త్రిలింగ దేశంలో నలువైపులా శివ భక్తులు ఉన్నారని, వారితో ప్రపంచమంతా వీక్షించేలా దీపోత్సవం నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

.. హ