Mahaa Daily Exclusive

  ఉత్తరప్రదేశ్‌ లో ఘోరం..! 10 మంది నవజాతా శిశువులు సజీవ దహనం- యోగి సర్కార్ ఏం చేస్తోంది..?

Share

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ఝాన్సీ మెడికల్ కాలేజీలోని పిల్లల వార్డులో శుక్రవారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 10 మంది చిన్నారులు మృతి చెందగా, మరో 32 మందిని రక్షించినట్లు పోలీసులు తెలిపారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగాయని, ఆ సమయంలో చనిపోయిన పిల్లలు ఇంక్యుబేటర్లలో ఉన్నారని జోన్ కాన్పూర్ ఏడీజీ అలోక్ సింగ్ ధృవీకరించారు.

 

ఈ అగ్ని ప్రమాద ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి 12 గంటల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని కమిషనర్‌, డీఐజీని సీఎం యోగి ఆదేశించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మృతుల కుటుంబాలకు తన సానుభూతిని తెలియజేశారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలన్నారు.

 

ఝాన్సీ జిల్లాలో ఉన్న మెడికల్ కాలేజీలోని ఎన్‌ఐసీయూలో జరిగిన ప్రమాదంలో చిన్నారులు మృతి చెందడం చాలా బాధాకరం. హృదయ విదారకంగా ఉందని, సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా యంత్రాంగం, సంబంధిత అధికారులను ఆదేశించామని సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. మరణించిన వారికి మోక్షం కలగాలని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.

 

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సూచనలను అనుసరించి, పరిస్థితిని పర్యవేక్షించడానికి ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని ఝాన్సీకి పంపించారు. ఈ ఘటనపై విచారణ జరిపి 12 గంటల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని కమిషనర్‌, డీఐజీని సీఎం యోగి ఆదేశించారు. మరోవైపు, చిన్నారులు మృతి చెందడటంతో వారి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పూర్తిగా కాలిపోయిన శిశువుల మృతదేహాలను తీసుకొస్తున్న వీడియోలు అక్కడి హృదయ విదారక పరిస్థితిని తెలియజేస్తున్నాయి.