Mahaa Daily Exclusive

  ఆ రైతులకు ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు.. రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్..

Share

కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు భూములు ఇచ్చిన రైతులకు శుభవార్త చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి. వరంగల్లోని కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తాజాగా ఇచ్చిన ఉత్తర్వులతో స్పష్టం చేశారు. 2024 జూన్ 29న ముఖ్యమంత్రి రేవంత్ వరంగల్ జిల్లాకు వచ్చిన సందర్భంగా టెక్స్టైల్ పార్కుకు భూములు ఇచ్చిన రైతులకు ఇంటి స్థలంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఇల్లు మంజూరు చేయాలని నిర్ణయించారు.

 

వారికి ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు ఉత్తర్వులు

ఈ మేరకు నేడు 863 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి డాక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాష్ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ పార్క్ పై ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని అన్నారు.

 

కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో భూములు కోల్పోయిన రైతులకు శుభవార్త

ఈ సందర్భంగా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో భూములు కోల్పోయిన రైతులను ఆదుకోవాలని చేసిన విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఇంటికి ఐదు లక్షల రూపాయలతో 863 ఇందిరమ్మ ఇండ్లు మంజూరుచేసిందన్నారు.

 

ప్రభుత్వ ఉత్తర్వులతో రైతుల్లో సంతోషం

రాష్ట్రంలో రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకూడదని సీఎం రేవంత్ రెడ్డి తో పాటు మంత్రులు చిత్తశుద్ధితో పని చేస్తున్నారని అన్నారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ రైతులను ఆదుకునేందుకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు ఇవ్వాలని అడిగినదే తడువుగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు వేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో రైతులు ఆనందంతో ఉన్నారని అన్నారు.

 

రేవంత్ చేతుల మీదుగా ఇళ్ళ పట్టాలు

నవంబర్ 19న వరంగల్ జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా టెక్స్టైల్ పార్క్ లో భూములు కోల్పోయిన రైతులు ఇండ్ల పట్టాలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ కు భూములు ఇచ్చిన రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంతో రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని అన్నారు.