Mahaa Daily Exclusive

  పుష్ప మేకర్స్ క్రేజీ ఐడియా..! వాటి ద్వారా ప్రమోషన్స్..!

Share

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) తాజాగా ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో చేస్తున్న సినిమా పుష్ప -2 (Pushpa -2). డిసెంబర్ ఐదవ తేదీన చాలా గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ చేపట్టారు చిత్ర బృందం. ఇదిలా ఉండగా ఈ ప్రమోషన్స్ కోసం రూ.150 కోట్లు ఖర్చు చేస్తున్నారు అంటూ ఒక వార్త తెరపైకి వచ్చింది. అసలే బడ్జెట్ కోసం భారీగా ఖర్చు పెట్టారు. ఒక్క జాతర సీక్వెన్స్ కోసం రూ.60 కోట్లకు పైగా ఖర్చయిందని, రిహార్సల్స్ కోసం అదనంగా మరో రూ.20 కోట్లు ఖర్చుపెట్టారు అంటూ ఈ సినిమాలో నటించిన నటీనటులు తెలిపిన విషయం తెలిసిందే.

 

‘పుష్ప’గాడి ప్రమోషన్స్‌కు రూ.150 కోట్లు..

 

అయితే ఈ భారం మొత్తం ఈ సినిమాను నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ పైనే పడుతుంది. దీనికి తోడు ఇప్పుడు ప్రమోషన్స్ కోసం మరో రూ.150 కోట్లు ఖర్చు.. అంటే పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. వాస్తవానికి బన్నీ సినిమా కాబట్టి మినిమం గ్యారెంటీ రేంజ్లో సినిమా హిట్ అవుతుంది. ఇక అందులోనూ జాతీయ అవార్డు అందుకున్న తర్వాత భారీ అంచనాలతో ఈ సినిమాని అల్లు అర్జున్ తెరకెక్కిస్తున్నారు. అందుకే నిర్మాతలు కూడా పెట్టడానికి వెనుకడుగు వెయ్యరు అంటూ కొంతమంది కామెంట్ లు చేస్తున్నా.. ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పుష్ప -2 సినిమా ప్రమోషన్స్ కి రూ.150 కోట్లు ఖర్చయినా ..ఆ భారం నిర్మాతలపై పడదని అంటున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

 

ఆ కంపెనీలదే భారం..

 

2024 డిసెంబర్ 5వ తేదీన ‘పుష్ప -2’ విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్స్ త్వరలోనే మొదలుపెట్టబోతున్నారట చిత్ర బృందం. ఈ మేరకు ఈ ప్రమోషన్స్ కి దాదాపు రూ.150 కోట్లు ఖర్చు చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలిసింది. అయితే ఈ మొత్తం డబ్బును నిర్మాతలు ‘మైత్రి మూవీ మేకర్స్’ కాకుండా వివిధ ప్రైవేట్ కంపెనీల నుంచి సేకరించబోతున్నట్లు సమాచారం. దీంతో అటు ఆ కంపెనీలు ఇటు పుష్ప 2 మూవీ కూడా ప్రమోట్ అవుతుంది. అలాగే నిర్మాతలకు డబ్బులు సేఫ్ అవ్వడమే కాకుండా, మూవీకి ఫ్రీ ప్రమోషన్ దొరుకుతుందని సమాచారం. ఏది ఏమైనా కనీవిని ఎరుగని రేంజ్ లో ఒక చిత్రాన్ని కంపెనీలు ప్రమోట్ చేస్తూ అటు నిర్మాతలకు లాభాన్ని అందివ్వడమే కాకుండా.. ఇటు కంపెనీలు కూడా కష్టపడకుండా ప్రమోట్ అవుతూ ఉండడం చూసి నెటిజన్స్ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. “మొత్తానికైతే పుష్పగాడికి ఫ్రీ ప్రమోషన్” అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. మరి భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న ఈ సినిమాతో బన్నీ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోతుంది అంటూ ఫ్యాన్స్ ఆశాభవం వ్యక్తం చేస్తున్నారు.ఇకపోతే ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై వై. రవిశంకర్, నవీన్ ఎర్నేని నిర్మిస్తున్నారు.