Mahaa Daily Exclusive

  ఏపీలో రైతులకు శుభవార్త..!

Share

ఏపీలో రైతులకు కూటమి సర్కార్ మరో శుభవార్త చెప్పింది. ముఖ్యంగా రైతులకు ఎంతో కీలకమైన ధాన్యం విక్రయాల విషయంలో ఎదురవుతున్న ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వాట్సాప్ తో ఒప్పందం కుదుర్చుకున్న ప్రభుత్వం.. దీన్ని రైతుల ధాన్యం విక్రయాల విషయంలోనూ వాడుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇవాళ వాట్సాప్ లో ధాన్యం విక్రయాల కోసం కొత్త వాట్సాప్ నంబర్ ను ప్రారంభించింది.

 

రైతులు చెమటోడ్చి పండించిన ధాన్యం విక్రయించుకొనేందుకు ప్రయాస అవసరం లేదని, 73373 59375 నెంబర్ కి వాట్సాప్ నుంచి Hi చెబితే చాలు… సేవలు అందుబాటులోకి వస్తాయని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇవాళ ట్వీట్ చేశారు. మీరు ఏ కేంద్రంలో, ఏ రోజు, ఏ టైములో, ఏ రకం ధాన్యం, ఎన్ని బస్తాలు అమ్మదలుచుకున్నారో మెసేజ్ ఇస్తే స్లాట్ బుక్ అవుతుందని రైతులకు సూచించారు.

 

అలాగే రైతులకు సులభంగా అర్థమయ్యే విధంగా కూటమి ప్రభుత్వం వాట్సాప్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చిందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.స్లాట్ బుక్ చేసుకోవడం ఎలాగో ఈ వీడియో చూడండి అంటూ ఓ వీడియోను కూడా ఆయన షేర్ చేశారు. ఇందులో రైతులు తమ ధాన్యం విక్రయించుకునేందుకు ముందుగా స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలి, ఇతర వివరాలు కూడా వివరించారు. ఈ వీడియోను చూస్తే రైతులకు అన్ని విషయాలు అర్థమవుతాయని ప్రభుత్వం చెబుతోంది.