Mahaa Daily Exclusive

  ఏడు బిల్లులకు ఆమోదముద్ర వేసిన ఏపీ అసెంబ్లీ..

Share

ఏడు కీలక బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఏపీ మున్సిపల్ సవరణ బిల్లు – 2024, ఏపీ పంచాయతీరాజ్ సవరణ బిల్లు – 2024, హెల్త్ యూనివర్శిటీ సవరణ బిల్లు – 2024, ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ నిరోధక బిల్లు – 2024, ఆయుర్వేదిక్ హోమియోపతి మెడికల్ ప్రాక్టిషనర్స్ చట్ట సవరణ, ఏపీ మెడికల్ ప్రాక్టిషనర్స్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణ బిల్లు – 2024లను అసెంబ్లీ ఆమోదించింది.

 

ఏపీ సహకార సంఘం సవరణ బిల్లు – 2024, ఎంత మంది పిల్లలు ఉన్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించేలా నిబంధనలు మారుస్తూ తీసుకొచ్చిన బిల్లులకు ఆమోదం తెలిపింది. అనంతరం అసెంబ్లీ సమావేశాలను స్పీకర్ అయ్యన్నపాత్రుడు రేపటికి వాయిదా వేశారు.