Mahaa Daily Exclusive

  తెలంగాణ సచివాలయంలో వాస్తు మార్పులు..

Share

తెలంగాణ సచివాలయంలో మార్పులు జరుగుతున్నాయి. తూర్పు వైపు ఉన్న ప్రధాన ద్వారాన్ని (బాహుబలి గేటు) మూసేస్తున్నారు. ఇందులో భాగంగా తలుపులు తీసేసి ఆ ప్రాంతంలో రేకులను ఏర్పాటు చేశారు. ఈశాన్యం గేటుకు తూర్పు వైపుకు ప్రధాన ద్వారం రానుంది. ఇక్కడ మరో గేటును ఏర్పాటు చేయనున్నారు. మిగతా గేట్లను యథావిధిగా ఉంచనున్నారు. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఉండటంతో ఆ లోపు వాస్తు మార్పులు పూర్తి చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

 

దాదాపు రూ.3.20 కోట్లతో ప్రభుత్వం ఈ మార్పులు చేస్తోంది. సచివాలయానికి ప్రస్తుతం నాలుగు వైపుల ప్రధాన గేట్లు ఉన్నాయి. తూర్పు వైపు లుంబినీ పార్క్ ఎదురుగా ఉన్న బాహుబలి గేటు నుంచి మాజీ సీఎం కేసీఆర్ రాకపోకలు జరిపేవారు. ఆ గేటు నుంచి సచివాలయం లోపల ప్రధాన ద్వారం వరకు రాకపోకలను కొంతకాలం నిలిపేశారు. ఆ దారిలోనే తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు చుట్టూ లాన్, ఫౌంటెయిన్లు ఏర్పాటు చేస్తున్నారు. నైరుతి, ఈశాన్య గేట్లను కలుపుతూ రోడ్డును కూడా వేస్తున్నారు.

 

పశ్చిమం వైపు మింట్ కాంపౌండ్ ఉంది. ఈ ద్వారాన్ని ఎక్కువగా ఉపయోగించడం లేదు. ఇక్కడ ఎలాంటి మార్పులూ చేయడం లేదు. సచివాలయం నిర్మాణం తర్వాత మార్పులు చేయడం ఇదే తొలిసారి. కొత్త సచివాలయ భవనాన్ని నాటి సీఎం కేసీఆర్ గత ఏడాది ఏప్రిల్ నెలలో ప్రారంభించారు.