Mahaa Daily Exclusive

  కేసీఆర్ ను కటకటాల్లోకి పంపిస్తా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో సంగతి చూస్తా.. సీఎం రేవంత్ రెడ్డి..

Share

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బుధవారం రూ.679 కోట్ల అభివృద్ది కార్యక్రమాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ముందుగా వేములవాడ రాజన్న ఆలయంలో పూజలు నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు అనంతరం జరిగిన బహిరంగసభలో పాల్గొన్నారు.

 

ఈ సంధర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తన పాదయాత్ర సమయంలో రాజన్న సాక్షిగా కేసీఆర్ ను గద్దె దింపాలని మొక్కుకున్నానని, రాజన్న దయతో తాను నేడు సీఎంగా ప్రజల ముందుకు వచ్చానన్నారు. జిల్లాను అభివృద్ది పథంలో నడిపించేందుకు తాను ఎప్పటికీ ముందుంటానన్నారు. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు నిరంతరం అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నామని, నవంబర్ 30 తేదీలోగా మళ్లీ మంత్రి ఉత్తమ్ పర్యటించి ప్రాజెక్టులను పూర్తి చేసే చర్యలకు శ్రీకారం చుడతారన్నారు.

 

గ్రామ స్థాయి నుండి దేశ స్థాయి వరకు తెలుగు వారి ఖ్యాతిని చాటిచెప్పిన పివీ నరసింహారావు కరీంనగర్ జిల్లా వాసేనన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కరీంనగర్ ఉమ్మడి జిల్లా యువత పోరాటాలు చేశారని, సోనియా గాంధీ నాడే ఈ గడ్డపై తెలంగాణ ఇస్తున్నట్లు ప్రకటించారన్నారు. ఏపీలో పార్టీ నష్టపోయినా కూడా, తెలంగాణను ఇవ్వాలన్న సంకల్పంతో సోనియా గాంధీ ఇచ్చిన మాట మేరకు రాష్ట్రాన్ని ఇచ్చారన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇచ్చిన హామీని నెరవేర్చడమేనాన్నారు.

 

కేంద్ర మంత్రి బండి సంజయ్ ను రెండు సార్లు గెలిపించారు కానీ, ఇప్పటి వరకు ఈ గడ్డకు నిధులు ఏమైనా తెచ్చారా అంటూ సీఎం ప్రశ్నింశారు. కేసీఆర్ పదేళ్లలో అప్పులు చేశాడు కానీ, వేములవాడ రాజన్న ఆలయ అభివృద్దిని మరచిపోయారన్నారు. సిరిసిల్ల ప్రాంతాన్ని అభివృద్ది చేయడంలో ఎలాంటి నిర్లక్ష్యం తాము వహించమన్నారు. గల్ఫ్ భాదితులకు తమ ప్రభుత్వం రూ. 5 లక్షలు అందించి, వారికి అండదండగా నిలుస్తుందన్నారు.

 

కాంగ్రెస్ పాలన సాగింది 11 నెలలు అయినప్పటికీ, ఎన్నికలు రావడంతో కేవలం 4 నెలల పాలన సాగించినట్లుగా ప్రజలు భావించాలని సీఎం కోరారు. మాజీ కేసీఆర్ కు మెదడు దొబ్బిందని, బీఆర్ఎస్ పాలనలో దేశంలోనే రైతుల ఆత్మహత్యలలో తెలంగాణ రెండవ స్థానంలో ఉండేదని తెలిపారు. పదేళ్ల కాలంలో రుణమాఫీ మాటే లేకుండా చేశారని, నేడు ఇందిరమ్మ రాజ్యంలో 25 రోజుల్లో 23 లక్షల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షల మేర రుణమాఫీ చేసిన ఘనత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వందేనన్నారు.

 

కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లు ఇవన్నీ సహించలేక, నువ్వు దిగిపో దిగిపో అంటూ పాట పాడుతున్నారన్నారు. సోషల్ మీడియాలో సొల్లు మాటలు ప్రచారం చేస్తే వినే పరిస్థితిలో ప్రజలు లేరని, సరైన సమయంలో తమ పార్టీ కార్యకర్తలు వాటికి సమాధానం చెబుతారని సీఎం అన్నారు. పదేళ్ళు అధికారంలో ఉంటే ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగుల కోసం పలు జాబ్స్ నోటిఫికేషన్స్ విడుదల చేసి అక్షరాల 50 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని, అప్పుడు చూద్దాం కేసీఆర్ అంటూ సీఎం సవాల్ విసిరారు.

 

కేసీఆర్.. తన ఫామ్ హౌస్ లో విశ్రాంతి తీసుకుంటుంటే, కేటీఆర్ ఏమో జన్వాడలో బామర్దికి ఫామ్ హౌస్ లో కట్టించారన్నారు. కేటీఆర్ బావమరిది మాత్రం డ్రగ్స్ కేసులో చిక్కితే.. బీఆర్ఎస్ పార్టీ వారము, మమ్మల్ని పట్టుకోవద్దని బీఆర్ఎస్ నేతలు అంటున్నారన్నారు. వికారాబాద్ కలెక్టర్ పై దాడికి సంభందించి సీఎం మాట్లాడుతూ.. వంద మంది బీఆర్ఎస్ రౌడీలు కలిసి దాడికి పాల్పడి, చంపే ప్రయత్నం చేశారని, వారిపై కేసులు పెట్టడం తప్పా అంటూ సీఎం ప్రశ్నించారు.

 

కొడంగల్ లో పరిశ్రమల ఏర్పాటుకు తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే, బీఆర్ఎస్ అడుగడుగునా అడ్డు తగులుతుందన్నారు. తాము రైతులకు మూడింతల నష్ట పరిహారం అందించేందుకు సిద్దంగా ఉన్నామని సీఎం అన్నారు. నా నియోజకవర్గం పై కేసీఆర్ కక్ష కట్టినట్లు, నియోజకవర్గ అభివృద్దిని కుట్ర పూరితంగా బీఆర్ఎస్ అడ్డుకుంటుందని, కేసీఆర్ ఇలాగే చేస్తే తాను ఖచ్చితంగా కటకటాల్లోకి పంపించడం ఖాయమన్నారు.