Mahaa Daily Exclusive

  మైసూర్‌లో ‘ఆర్‌సీ16’ షూటింగ్ షురూ..! ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు ఆస‌క్తిక‌ర ట్వీట్‌..!

Share

గ్లోబ‌ల్ స్టార్‌ రామ్‌చరణ్, ‘ఉప్పెన’ ఫేమ్‌ బుచ్చిబాబు సానా కాంబోలో ఓ చిత్రం వ‌స్తున్న‌ విషయం తెలిసిందే. ‘ఆర్‌సీ16’ వ‌ర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ రూపొందుతోంది. బాలీవుడ్ ముద్దుగుమ్మ‌ జాన్వీకపూర్‌ కథానాయిక. ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ అప్‌డేట్‌ కోసం మెగా అభిమానులు ఎంతో ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపుల‌కు తెర‌దించుతూ డైరెక్ట‌ర్ బుచ్చిబాబు ఈరోజు కీల‌క అప్‌డేట్ ఇచ్చారు. మైసూర్‌లో చాముండేశ్వరి మాత ఆశీస్సులతో షూటింగ్‌ను మొదలుపెట్టబోతున్నామ‌ని ప్ర‌క‌టించారు. అంద‌రి ఆశీస్సులు కావాలంటూ చాముండేశ్వరి మాత ఆల‌యం ముందు దిగిన ఫొటోను ఆయ‌న ‘ఎక్స్’ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా పంచుకున్నారు.

 

ఇక్క‌డ చెర్రీతో పాటు ప్రధాన తారాగణంపై కొన్ని కీలక స‌న్నివేశాలను తెరకెక్కిస్తారని సమాచారం. ఇక ఉత్తరాంధ్ర నేపథ్యంలో స్పోర్ట్స్‌ డ్రామాగా ‘ఆర్‌సీ16’ చిత్రాన్ని రూపొందించనున్నారు. ఈ సినిమాకు ఆస్కార్ విజేత‌ ఏ.ఆర్‌.రెహహాన్ బాణీలు అందిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ మైత్రీ మూవీ మేకర్స్‌ భారీ వ్యయంతో దీనిని నిర్మిస్తోంది. ఇదిలాఉంటే.. రామ్‌చరణ్, శంక‌ర్ కాంబినేష‌న్‌లో తాజా చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’ జనవరి 10న ప్రేక్షకుల ముందుకురానుంది.